పుట:Geetanjali (Telugu).pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గీతాంజలి.

నాసుఖస్పర్శ నొకతూరి ♦ నందనిమ్ము.

88


శిధిలదేవాలయంబున ♦ జెలగుదేవ!
నిన్నుగూర్చినపాటలు ♦ నెమ్మితొడ
వీణెతంతులు పాడవు ♦ విఱిగియుంట;
స్వామి! నీపూజసమయంబు ♦ జాటవింక
సంజవేళల గంటలు ♦ చప్పు డుడిగి;
గాలి మౌనము ధరియించి ♦ కదలకుండు
జీర్ణభవదీయవాసంబు ♦ జేరవచ్చె
మధురమధుమానవాతమ ♦ మందగతిని;
పూలపరిమళవార్తల ♦ లీలదెచ్చె
గాని యాపూల గాన్కగా ♦ గాంచవింక.
మున్ను నీపూజ గావించు ♦ చున్నవాడు
వరము గనకుండ నింకను ♦ దిరుగుచుండు
ధూమమును నీడలునుబొయి ♦ దుమ్ముగలయ
సంజవేళను బడలిక ♦ జాలిగలిగి
డెంద మెంతయు క్షుద్భాధ ♦ గుందుచుండ
శిధిలదేవాలయంబును ♦ జేరునతడు.
జీర్ణదేవాలయంబున ♦ జెలగుదేవ!
నడియె లేకుండ జరుగు ను ♦ త్సవములెల్ల