పుట:Geetanjali (Telugu).pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గీతాంజలి.

మేలుకీడులతో జాల ♦ గాల మరిగె.
వర్ధదినముల నాతొడ ♦ నాడుకొన్న
వాడు నాహృదయంబును ♦ నేడు లాగె
పనికిమాలినయట్టి యే ♦ పనికి నన్ను
నిట్లు తటుకున బిలిచెనో ♦ యెఱుగరాదు.

90


నీదువాకిలి మరణంబు ♦ నిలిచి తట్ట
నేమి యెసగడు కాన్కగా ♦ నీవు చెపుమ?
అట్టులరుదెంచినట్టినా ♦ యతిదిముందు
బాత్ర సంపూర్ణజీవిత ♦ పాత్ర నిడుదు;
బంప నేనట్టిచేతుల ♦ బంప నతని.
నాదుదినములు కడగన్న ♦ నాడు వచ్చి
నాదువాకిలి నామర ♦ ణంబు దట్ట
శీతదినముల వేసంగి ♦ రాతురులను
గన్న మధురఫలంబుల ♦ గారవముల
నెంతయును శ్రమ నేగన్న ♦ యెల్లసిరుల
బొందుగా గూర్చి యాతని ♦ ముందు నెడుదు.

91


జీవితమునకు ఫలితార్ధ ♦ మై వెలుంగు