పుట:Geetanjali (Telugu).pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
86

గీతాంజలి.

87


కట్టకడపటియాశతో ♦ గదిని జేరి
యామెకయి మూలమూలల ♦ యందువెదకి
కాననైతిని నేనామె ♦ గాననైతి.
ఇల్లు చిన్నది పోయిన ♦ దెద్దియైన
గానబడ దెన్నటికినైన ♦ గాన బడదు;
నీదుభవన మనంతమై ♦నెగడు గాన
స్వామి యామెను వెదుకంగ ♦ వచ్చినాడ;
నీదుసంధ్యాంబరంబను ♦ నిగ్గులొల్కు
పైడి మేల్కట్టునీడలో ♦ వలను నిల్చి
నేను దమి నిక్కి చూచెద ♦ నీముఖంబు;
నిత్యమను నార్ధితుది జేరి ♦ నిలిచినాను
దానిలో నాశ మొద్దాని ♦ కేని లేదు.
కంటిలోపల నశ్రువుల్ ♦ గ్రమ్మియుంట
నాడ్శ గాని మరెట్టిసౌ ♦ ఖ్యంబు గాని
యెముఖచ్చాయ గాని నా ♦ కెఱుగరాదు.
ఏమియును లేక వట్టిగా ♦ నెనగునన్ను
నమ్మహావార్ధిలోపల ♦ నద్ది యద్ది
పూర్ణమైనట్టి లోతులో ♦ ముంచి విడుము
విశ్వమంతట లోపల ♦ విలయమందు