పుట:Geetanjali (Telugu).pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

85

గీతాంజలి.

వదలి యుండిరి జీవిత ♦ ఫలము లెల్ల.

86


చేరి వాకిట మిత్తి నీ ♦ సేవకుండు
నెఱుగ రానట్టిసంద్రంబు ♦ నెలమి దాటి
దేవ ! నీ యాజ్ఞ నిదె నాకు ♦ దెచ్చినాడు;
కటికరాతిరి జిమ్ముచీ ♦ కటులుగ్రమ్మె;
నాత్మ చలియించె భీతిచే ♦ నైన నేను;
దీపమును గొని తలుపుల ♦ దెఱచివైచి
స్వాగతం బిచ్చి మ్రొక్కెద ♦ సంతసమున
వాకిటను వచ్చి నిలిచిన ♦ నాడుచూడ
నీవు పంపినదూతయై ♦ నెగడుచుంట;
గరములను మోడ్చి కన్నీరు ♦ గ్రమ్ముచుండ
నతని బూజింతు నెంతయు ♦ వర్ధితోడ;
జ్రణములజిత్తకోశంబు ♦ దెఱచిపెట్టి
యతని బూజింతు నెంతయు ♦ వర్ధితోడ
దానువచ్చినపని తీర్చి ♦ తరలునతడు
నాదుప్రాభాతమున నిల్చి ♦ నల్లనీడ.
పాడువడినట్టి నాయింట ♦ వదలబడిన
నేను మాత్రమె నీతుది ♦ కానుక యయు
నిలిచి యుందు నోనాధ ♦ నిలిచియుందు.