పుట:Geetanjali (Telugu).pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గీతాంజలి.

శాంతితో పొంగు నిట్టివి ♦ శ్రాంతివేళ
నీముఖాముఖం గూర్చుండి ♦ నిశ్చలముగ
బ్రాన మంకితంగ నిడు ♦ పాట బాడ
నెంతయును యోగ్యసమయమై ♦ యొసగు గాదె?

6


ఈసుమము జాగు సేయక ♦ కోసి కొమ్ము
అలసించిన దుమ్ములో ♦ రాలు జుమ్ము
నెలపు దీనికి నీదండ ♦ గలుగదేని
త్వత్కరస్పర్శబాధచే ♦ సత్కరించి
కోసి కొ ; మ్మాలసింపక ♦ కోసి మొమ్ము.
బాగుగా నాకు మెలకువ ♦ వచ్చులోన
బ్రొద్దువోవునొ ముగియునో ♦ పూజవేళ
యంచు భయపడుచుంటి; నా ♦ కభయ మిచ్చి
కోసి కొ ; మ్మాలసింపక ♦ కోసి కొమ్ము.
అంతగా రంగు లేకున్న ♦ నల్పముగను
బరిమళం బున్న నిప్పువ్వు ♦ ప్రభువతంస
స్వీకరింపుము భవదీయ ♦ సేవకొఱకు ;
దప్పి పోకుండ దరుణంబు ♦ దయ దలిర్ప
గోసి కొ ; మ్మాలసింపక ♦ కోసి కొమ్ము.