పుట:Geetanjali (Telugu).pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గీతాంజలి.

7

నాదుగానాంగన దొఱంగె ♦ నగల నెల్ల ;
వస్త్రభూషణగర్వ మ ♦ ప్పడతి పడదు
భూషలం గల్గునన్యోన్య ♦ మునకు హాని
నాకు నీ కవి యడ్డమై ♦ నడుమ నిలుచు
రణితమున ముద్గునీగూఢ ♦ రమ్యవాణి.
నీవు తల యెత్తి చూచిన ♦ నిలువలెక
నాదుక విదంభము నశించు ♦ నానచేతం ;
గవులకెల్లను నాధుడై ♦ క్రాలుదేవ!
నీదుపాదాబ్జములకడ ♦ నిలిచినాడ ;
నీవు రమ్యస్వరంబుల ♦ నింపి పాడ
వేణు వగురీతి నాదుజీ ♦ వితము నేను
జల్పుదును గాక సరళమున్ ♦ సాధువుగను.

8


కంఠమున దారహారది ♦ కముల దాల్చి
యెడలిపై రాజవస్త్రంబు ♦ లొప్పుచుండు
బాలు డాటలసౌఖ్యంబు ♦ బడయ గలడె?
ఆడ గడగినయపు డెల్ల ♦ నతనియడుపు
లడ్డముగ వచ్చి యాతని ♦ నాపుచుండు ;