పుట:Geetanjali (Telugu).pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

71

గీతాంజలి.

71

నన్ను నే బెద్ద యనుకొని ♦ యన్నికడల
రంగునీడల నీప్రభా ♦ రాశిమీద
నెలకొలుపుచుందు నీదె గదా ♦ నీదుమాయ.
నీవె నీలోనిభాగంబు ♦నెమ్మి దీసి
పిలుగు వద్దాని నెన్నియో ♦ పేళ్లచేత;
నీవిభారమె నాదునా ♦ కృతిని గాంచె;
గగనమంతటనుండి యీ ♦ కఠినగీతి
ప్రతిరసము లీను జత్రబా ♦ ష్పములయందు
హర్షభయములయందును, ♦ నాశలందు;
వీచికలు మాటిమాటికి ♦ లేచి పడును;
గలలు విరియుచు వెండియు ♦ గలుగుచుండు;
నీవు నాయందు నోడుదు ♦ నీకు నీవె.
ఈ వొనర్చిన తెరమీద ♦ నెన్నియేని
జిత్రములు వ్రాయబడియె వి ♦ చిత్రముగను
మించురేయంబవళ్లను ♦ కుంచెతొడ.
గనగ విసు గగుసరళరే ♦ ఖలను వీడి
యతివిచిత్రపువంపుల ♦ నల్లబడిన
నీదుపీఠంబు తెరవెన్క ♦ నెగడుచుందు.
నీకు నా కగుబండుగ ♦ నింగి బర్వె;