పుట:Geetanjali (Telugu).pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
70

గీతాంజలి.

ధన్యతను గాంచె నందునే ♦ దలచు చుందు;
నెంతయోకాలమునుబట్టి ♦ హృదయ మంటి
యిపుడు నుచ్చోణితంబున ♦ నృత్యమాడు
నాయహంభావ మెన్నన ♦ నాతనంబు

70


ఒక్కలయగతి నేగునీ ♦ యుత్సవ్చమున
నలరుటయు భీతి గొల్పెడు ♦ హర్షమనెడు
సుడిని బది తూలి బ్రద్ధలై ♦ మడియుటయును
నీకు బాహ్యంబు లౌ నేమొ ♦ నాకు జెపుము.
తిరగి చూడక నిలివక ♦ తెన్నువట్టి
యన్నియును గొట్టుకొనిపొవు ♦ నద్భుతముగ
వానినాపనిగ శక్తి యె ♦వ్వనికి గలదు?
సకలమునుబోవు బొవు గొ ♦ ట్టుకొని పోవు;
గనకవిశ్రాంతి పాఱు నీ ♦ గానగతికి
దగినరీతిని నడుగుల ♦ ద్వరగ నిడుచు
వచ్చుచుం బాటలను మఱి ♦ పరిమళముల
బోయుచుండును సెలయేళ్ల ♦ బోలె నెపుడు
క్షణములొ దూలి పొలయుసౌ ♦ ఖ్యములయందు.