పుట:Geetanjali (Telugu).pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

55

గీతాంజలి.

మెట్టినపు డెల్ల ద్రోవ యన్ ♦ మేలివీణె
భవ్యరవముల నీనదే ♦ బాధపేర?

56


మిడి నాలోన నీహర్ష ♦ ముండు నిట్లు.
ఇత్తెఱంగున నను జేర ♦ వచ్చు వీవు.
ఏనె లేకున్న నీప్రేమ ♦ మెచట నుండు?
దివిభుల నెల్ల నేలెడు ♦ దేవదేవ !
చెన్నుమీఱుచు నుందునీ ♦ సిరుల కెల్ల
గైకొనితి నీవు నన్ను భా ♦ గస్థు గాగ.
నీమహానంద మేవేళ ♦ నృత్యమాడు
నదనముగ నుండు గాదె నా ♦ హృదయసీమ
భవదుదారేచ్చ రూపంబు ♦ బదయుచుడు;
సతతమును దేవ ! నాదుజీ ♦ విత్రమునందు.
నన్ను మోహింపజేయగా ♦ నాధనాధ !
భవ్యరూపంబు నీ విట్లు ♦ పడసినావు.
దీనికై నీదుప్రేమంబు ♦ లీన మౌను
బేర్మితో నిన్ను బ్రేమించు ♦ ప్రేమలోన;
గడకు రెం డిట్లు పూర్తిగ ♦ గలసి పొవ
నందు గానంగ వత్తు నా ♦ నందముగను.