పుట:Geetanjali (Telugu).pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
54

గీతాంజలి.

నింబవృక్షంబుపై బత్త్ర ♦ నిచయములును
గదలి గాలికి జప్పుడు ♦ గలుగ జేసె;
జింత సేయుచు గూర్చుంటే ♦ జిత్తమునను.

55


మాంద్య మింకను విడదు నీ ♦ మానసమును;
నిద్ర యింకను విడదు నీ ♦ నేత్రములను;
బుష్పరాజము ఠీవితొ ♦ ముండ్లనడుమ
నెంతయును గ్రాలె ననుటను ♦ నీవు వినవె?
మేల్కొనుము జాగు సేయక ♦ మేలు కొనుము.
ప్రొద్దు వ్యర్ధంబుగా బుచ్చ ♦ బోకు వినుము.
మత్సఖుం డీశిలామయ ♦ మార్గమునకు
నంతమం దుండుకేవలై ♦ కాంతసీమ
నొంటిగా దాను గూర్చుండి ♦ యున్నవాడు.
మోసపుచ్చకు పుచ్చకు ♦ మోసమతని.
మేల్కొనుము జాగు సేయక ♦ మేలుకొనుము.
మండు మధ్యాహ్మమందలి ♦ యెడవడికి
బెదరి దివి గుండె లదరిన ♦ నదరు గాక;
తప్తసికతంబు దాహన ♦ స్త్రంబు దాను
వింతగా దాల్చ విప్పిన ♦ విప్పు గాక;
హృదయగంభీరతలమున ♦ ముదము లేదె?