పుట:Geetanjali (Telugu).pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

55

గీతాంజలి.

బిలిచినం బోక యేమేమొ ♦ తలపులందు
మునిగి తోచక నే బ్రొద్దు ♦ బుచ్చు చుంటి
నాకు నీవచ్చునడి చెవి ♦ సొక లేదు.
నను గనెడుచూపె నీవిన్న ♦ దనము జెప్పె.
"దప్పి గొంటిని బాంధుడ ! ♦ దప్పి గొంటి."
ననెడునీకంఠమే తెల్ప ♦ నలసి యుంట;
గాన గలవరమును మాని ♦ కడవ వంచి
నీరుదోయిట బోసితి ♦ నెరములను;
గాలిచే మీద నాకులు ♦ గలగలమనె;
గనుల బడకుండ గూసె బి ♦ కంబు నీడ.
దారికొనవంపులోనుండి ♦ తరలి వచ్చి
పొగడపూవుసువాసనల్ ♦బుగులుకొనియె.
అడిగితిని పేరు గావున ♦ బొదమి లజ్జ
మౌనమును దాల్చి నిల్సితి ♦ మాట లుడిగి
ఇంతకును నేను జేసిన ♦ దేమి గలదు
నీవు నన్మదిలోపల ♦ నిల్చుటకును?
నీకు దహంబు దీర్పంగా ♦ నీర మీయ
గాంచుటయుఎ హర్షమున నన్ను♦ ముంచుచుండు.
స్థిరముగా మన్మనంబున ♦ జేరి నిలిచి
తెల్లగా దెల్లవా!ఱెను; ♦ మెల్లమెల్ల
బక్షిజాలమ్ము లటనట ♦ బాడ జొచ్చె.