పుట:Geetanjali (Telugu).pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
56

గీతాంజలి.

57

తేజమా ! నాదుతేజమా ! ♦ దీప్తిచేత
జగములను నింపుతేజమా ♦ స్వాంతమందు
శాంతమును గూర్చుతేజమా ! ♦ చక్షువులను
ముద్దుగొనుతేజమా ! నీకు ♦ నుద్ది యెద్ది?
ప్రేమమా ! నాదుజీవన ♦ సీమనడుమ
నిరతమును దేజ మెంతయు ♦ నృత్యమాడు.
ప్రేమమా ! ప్రేమతంతుల ♦ బ్రేమతోడ
దేజ మొకయింత దాగిన ♦ దేటముగను
నింగి నిచ్చును గాలి చె ♦ లంగి వీచు;
హర్షపూరము భూమిపై ♦ నట్టె పాఱు;
నెలమితోడ సీతాకోక ♦ చిలుక లెపుడు
తేజ మనునర్ధిమీదనె ♦ తెరలువిప్పు;
జెలగుతేజోబ్ది వీచికా ♦ శీర్షములనె
వలసి కల్వలు మల్లెలు ♦ నిచ్చుచుండు.
స్వర్ణమును మేఘములమీద ♦ బార జల్లి
రత్నరాజిని వెదజల్లు ♦ రాజుగూడ;
దేజమే సుమ్ము ప్రేమమా! ♦ తేజె సుమ్ము
పర్వు బైబయి పర్వంబు ♦ పత్రములను
హర్ష మంతట బ్రాకును ♦ హద్దుమీఱి