పుట:Geetanjali (Telugu).pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గీతాంజలి.

అదిగొ ! తీరంబుపై నంజ ♦ యావహించె;
గనువెలుతు రుండగనె యా ♦ కడలిపులుగు
లెలము దమతముగూడుల ♦ కెగసి వచ్చె.
ఎపుడు విత్తురు గొలుసుల? ♦ నెపుడు పడవ
సంజయందలి కడపటి ♦ చాయ వోలె
గానరాకుండ రాత్రిలొ ♦ గలసి పొవు?
నెవడు చెప్పంగ గలడిది ♦ యెవని కెఱుక?

43


స్వామి! నే నీకు సంసిద్ధ ♦ పడనినాడు
పిలువ బడకుండ నాకును ♦ దెలియకుండ
నొక్క్సామాన్యుకరణి నా ♦ యుల్లమందు
నెమ్మదిగ జొచ్చి నాజీవి ♦ తమ్ము లోని
స్థిరముగా మది నిల్వని ♦ చినిచిన్ని
యెన్నియోయంశములమీద ♦ నెశ ! నీదు,
"నిత్తే" మన్ ముద్ర జక్కగా ♦ నొత్తినావు.
లీల దీపంబు నేను వె ♦ ల్గింప నేడు
కాంతిపడి వానిమీద నీ ♦ సంతకంబు
స్పష్టముగ దోచె ననియెల్ల ♦ బాల్యమందు
గాంచి మఱచినసుఖముదు:ఖ ♦ గణముతోడ
జేరి దుమ్మున నటునిటు ♦ జెదరియుండె