పుట:Geetanjali (Telugu).pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
38

గీతాంజలి.

శైశవంబున దుమ్ములో ♦ నలిపినట్టి
క్రీడలనుగూడ నేవతో ♦ జూడ నీవు.
తార లీనెడునిప్ప్రతి ♦ ధ్వనులు గూడ
నాటకగది నాడు నేవిన్న ♦ యడుగుపడులె.

44


విడువకుండగ వెలుతురు ♦ వెంట నంటి
తఱుము నీడను దేసంగి ♦ దారి బట్టి
వచ్చు చుండెడువర్షమున్ ♦ వాంచతోడ
వీధివెంబడి గూర్చుండి ♦ వేచి యిట్లు
గాంచు టెంతయు మోదమ్ము ♦ నించు మదికి.
కాంచి యెఱుగనియంతరి ♦ క్షములనుండి
దూత లరుదెంచి శుభవార్త ♦ తోడ నాకు
స్వాగత మొసంగి తమదారి ♦ జనిరి వేగ.
అంతరంగము లోలోన ♦ నలర దొడగె.
మధుర మగునూర్పుతో వీంచె ♦ మారుతంబు
ప్రొద్దు వొడిచినదాదిగా ♦ బ్రొద్దు గ్రుంకు
దనుక గూర్చుందు వాకిట ♦ దలగ కుండ;
నన్ను దున్నట్లుగా వచ్చు ♦ నెన్నడేని
శుభసమయ మెను దప్పక ♦ చూతు నంచు
నెమ్మది నెఱింగి యున్నాను ♦ నిశ్చయముగ.