పుట:Geetanjali (Telugu).pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గీతాంజలి.

గుందుచున్నాడు చింత ని ♦ గ్గొందిలోన;
జుట్టు నీగోడ గట్టగా ♦ జొచ్చినాడ;
బెరిగి యిది నాడునాటికి ♦ వింటినంట
మన్నిజస్థితి తచ్చాయ ♦ మఱుగు వడియె.
గర్వపడుచుందు నీగోడ ♦ గాంచి కాంచి;
కన్న మేదియు దీనిలో ♦ గలుగకుండ
బొందుగా మట్టితో బూత ♦ బూయుచుందు;
నింత మెలకువ బనిచేసి ♦ యంతమందు
మన్నిజస్థితినే నేను ♦ మఱచిపొదు.

30


నాదుసం కేతమునకు నే ♦ మోద మొప్ప
నొంటిగా బైలుదేరితి ♦ నొంటిగానె;
కాని చీకటిలో నాకు ♦ గాన బడక
వెంతనంటెను మెల్లగా ♦ వీడెవండో.
తప్పుకునుతకు నటునిటు ♦ దలగు చుందు;
గాని తప్పించుకొననైతి ♦ వీనినుండి
దుమ్ము రేపును వీడు దం ♦ భమ్ము లాడి;
వానికేకను నాప్రతి ♦ వాక్యమందు
గూర్చుచుండును దాను సం ♦ కోచపడక;
నాధ ! వీ డెవ్వడో కాదు ♦ నాయహమ్ము.