పుట:Geetanjali (Telugu).pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
26

గీతాంజలి.

అతడెంతయు సిగ్గు లే ♦ నట్టివాడు,
అతనితో గూడి నీద్వార ♦ మందు జేర
నాకు సిగ్గగుచుండు న ♦ నాధనాధ !

31


"బద్ధుడా నీకు నెవనిచే ♦ బంధనంబు
గలిగెనో నాకు జెప్పంగ ♦ గలవె?" యనిన
"బ్రభువుచే" నని బద్ధుండు ♦ పలికెనిట్లు ;
"శక్తి సమపదలందు నీ ♦ జగతిలోన
నందఱిని మించగల నని ♦ యాత్మ నెంచి
యధిపునకు జెల్లవలసిన ♦ యర్ధమెల్ల
గూర్చి యుంచితి నాస్వంత ♦ కోశమందు;
బ్రభువునకు సిద్దపఱచిన ♦ పాన్పుమీద
నిద్రపోయితి బన్నుండి ♦ నిలువలేక ;
కానిమేల్కొని మద్ధనా ♦ గారమందె
యిట్లు బద్దుండ నైయుంట ♦ నేను గంటి."
"ఇట్లు తేగనట్టిసంకిలి ♦ నెవడు నేసె
బద్ధుడా! చెప్పవే" యని ప్రశ్న సేయ
నొసగె నాతడుమరల నీ ♦ యుత్తరంబు
"ఎంతయో శ్రధ్దతొడ నీ ♦ శృంఖలంబు
నేనె కావించుకొంటి నే ♦ ఱెవరు గాదు;