పుట:Geetanjali (Telugu).pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

129

గీతాంజలి.

రేయినిశ్శబ్ధమై యుండు ♦ రీతినుండి
యెల్లకావలివారల ♦ నేమఱించి
యడుగుపై నడుగిడుచు ర ♦ హస్యముగను
సంచరించుచు నుందువు ♦ స్వామి ! నీవు.
పూర్వవాయువుతా నెంత ♦ పూన్కి తొడ
నఱచి పిలుచుచునుండిన ♦ సరకుగొనక
నేతివేకువ మోడిచె ♦ నేత్రములను.
నీలమున్ మించునిచ్చలు ♦ మేలుగాంచు
నాకసముమీద దట్టమై ♦ యమరె ముసుగు;
గానములనద్దు నణచెను ♦ గాననములు;
ప్రతిగృహకవాటమును మూయ ♦బడెన్; గాని
నిర్జనం బైనవీధిలో ♦ నీ వొకడవె
పాంధ ! తిరుగుచునున్నావు ♦ భయములెక,
ఓమదీయైకసన్మిత్ర ! ♦ యోమదీయ
ప్రియతమప్రాణనాధ ! నా ♦ గృహమునందు
దెఱవబడె నన్నితలుపులు ♦ దేవ ! నీవు
వచ్చి స్వప్నంబు కైవడి ♦ వలదు చనగ.

23


ఈ మాహావర్షరాత్రిలో ♦ నెలమితోడ
బ్రేమ జూపెడుయాత్రకై ♦ వెడలినావె?