పుట:Geetanjali (Telugu).pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
20

గీతాంజలి.

యాశలెల్లను భంగ మై ♦ నట్టిదాని
వలెను గగనంబు మూల్గు నో ♦ ప్రాణమిత్ర!
నిద్రా వాచ్చుట యెక్కడ! ♦ నేటిరాత్రి;
దీసి తలుపులు పలుమాఱు ♦ దీసి తీసి
చూచినకొలంది జీకటే ♦ చూడ నయ్యె;
గానబడ దేమియును ముందు ♦ గానబడదు.
ఎద్ది నీమార్గ మద్భుతం ♦ బెచట నుండు?
నల్లని మషీజలమ్ముల ♦ వెల్గునట్లు
తనదు నేనీలవాహినీ ♦ తటమునుండి
తద్దయును గోపభావంబు ♦ త్రమ్మునుండి
యేమహాగాఢనీలాధ్వ ♦ సీమనుండి
వచ్చినాడవు? నాకడ ♦ వచ్చినావు.

24


నిద్రచే గప్పి భూమిని ♦ నెమ్మితోడ
నుండ దూలుచు నుండెడు ♦సారసంపు
ఱేకులను మూయుచుండు లో ♦ కైకనాధ !
పగలు చనెనేమి బక్షులు ♦ పాడవేని
గాలి బడలిక చే గుంది ♦ కదలదేని
నాసయినిగూడ గప్పుము ♦ సాధ ! యిపుడు