పుట:Geetanjali (Telugu).pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గీతాంజలి.

శబ్దమేలేనితంతుల ♦ చారుగాన
రసము పొంగుమహాస్థాన ♦ రంగమునకు
దీసికొనిపోదు దప్పక ♦ దీని నిపుడు.
నిత్యమను పాటలో దీని ♦ నెమ్మిగూర్చు;
దీనికడనడియూపిరి ♦ తీఱినపుడు
మౌనముగ నుండునీవీణె ♦ మోనికాళ్ల
కప్పగింతును దప్పక ♦ యప్పగింతు.

101


దేవ ! యెప్పుడు నేను నా ♦ జీవితమున
నాదుగీతాళిచేతనే ♦ నాధ ! నిన్ను
వెదకుచుంటిని దప్పక ♦ వెదకుచుంటి.
ఇంటి కింటికి నన్నవి ♦ యెలమి జేర్చె
వానితో నుండుటను నావ్ర ♦ పంచ మెల్ల
వెదకి యంటినయట్టులు ♦ మదికి దోచె.
నేను నేర్చినపాఠము ♦ లెల్లనాకు
నవియె నేర్పెను దప్పక ♦ యనియె నేర్పె;
నెన్నియోగూఢమార్గమ్మ ♦ లెఱుగజేసె.
అంతరాకాశమందున ♦ నలరుచుండు
నెన్నియోచుక్కలను నాదు ♦ దృష్టిముందు
నవియె పెట్టను దప్పక ♦ యనియె పెట్టె.