పుట:Garimellavyasalu019809mbp.pdf/98

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కనుక రసవంతులని కూడా చెప్పవచ్చును. రసమును స్పురింపజేయునదే కళ. కనుక కళావిలాసులని కూడ చెపవచ్చును. మనమే విమర్శకులము కూడ గనుక సకల కళల యందును అనుభవము కలవారని చెప్పవలెను. అయితే మనకును కేవలం సాహిత్య లేఖకులకును గల వ్యత్యాసమేమనగా వారు పరిశుభ్రమయిన సోపానకులును, కళాభిమానులును అయివుండగా మనము ఆ రసములను కళలను ప్రజాసేవకు విజ్ఞానమునకు, దేశపురోభివృద్ధికి వినియోగపరచుటకై తాయారై యున్నవారము. ఇట్టి వారికే (Progressive Writers) అనునామము తరచుగా ఉపయోగించుచున్నారు., ఈ పదమును సరిగా మనం తర్జుమా చేస్తే పురోబివృద్ధి లేఖకులని పిలువవలెను. ఇతరుల వ్రాతలు కూడా పురోభివృద్ధికి హేతువులవునా కాద అను చొప్పదంటు ప్రశ్నలు చర్చల కెవ్వరును పోక మొదటి వారిని సాహిత్య సేవకులనిన్ని మనలు పురోభివృద్ది లేఖకులనిన్ని ప్రస్తుత్య ప్రపంచాచారము చొప్పున పిలిచినంత మాత్రమున ప్రమాదము లేదని నేను భావించుచున్నాను. ఇంతమాత్రమున మన వ్రాతలకు సాహిత్యప్రపంచంలో స్థానము లేకపోనూ లేదు. అన్నిభేదములవలె ఈ భేదము కూడా కాల్పనికమును సులువుకొరకు చేయబడిదియు అంగీకృత మైనదియునైయున్నది. ఇంతకూ ఎవరి కర్తవ్యమును వారెరుంగుట ప్రధానము. మన కర్తవ్యము మనకు తెలుసును మనమింక ఇట్టిపనికై గడంగ వలయును దేసమును, ప్రభుత్వమును, మన ప్రయత్నములకు సహాయకరమైనచో అనతి కాలంలో మనదేశము విజ్ఞానమున అమితవృద్ధిని పొందగలదనుట ముమ్మాటికీ నిశ్చయము.

ఆంధ్రపత్రిక, 27.1`0.1938