పుట:Garimellavyasalu019809mbp.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

భ్రమపెట్టని వారెవరు?

  స్వరాజ్యవాదులు తమ ప్రత్రిఘటన, ఉద్యోగతిరస్కరణ నినాదములతో వోటర్లను భ్రమపెట్టుచున్నారు. కనుక వరికి వోటు లీయవలదని సముచిత సహకరవాదుల కేకమై యున్నది. ప్రభుత్వము వారు మన నేషనలు డిమాండు నూ కొట్టానిదే వారి సహకార పరిరంభణము లోనికి మనముఱకుట నీచతరమగు సహకారమే కాని సముచిత సహకారము కాదనియు, సముచిత సహకారము శబ్దమువలనమోసపోక మీబిగువు సడలించుకొన వలదని  స్వరాజ్యవాదుల మందలింపైయున్నది. శాసనసభలలోనే మన మోక్షమెల్లయు నున్నది. కనుక వాటి మూలమున ముక్తి దేవతను మేమారధించి ఉద్యోగ పట్టాభిషేకముల నంది బలపజ్జాతుల యాగడముల నుండి బలహీన జాతుల వెల్ల మేము కాపాడెదమని జస్టీసు పక్షమువారి యాక్రందనమై యున్నది. ఈకళలోను, ఈ మందలింపుల లోను, ఈ యాక్రందనలోను భ్రమపెట్టుట యెంతవర కున్నదో, నిజమెంతవరకున్నదో మనమాలోచించవలెను. ఈ సూత్రములు వారి వారి విశ్వాసమును ఆశయములను మాత్రమే యైయున్నంతసేపు వారి విశ్వాసములను ఆసయములను వారు గ్గడించుటలో భ్రమయేమియును లేదు. లేక వారి వారి సూత్రములను శాసనసభలో నెరవేర్చుకొన్నగలమని  ఆశపడుచున్నచో ప్రజలను భ్రమపెట్టుట మాట యటుల నుంచి తామే ముందు భ్రమపడుచున్నారు. ఇవి వారికే భ్రమలై యున్నంతసేపు ప్రజలను తా మమలులో పెట్టజాలమను రూఢియగు భవిష్యజ్ఞాన ముండియు, పెట్టగలమని కోరి యబద్ధములాడుచు ప్రజల నుండి వోటులు తస్కరించవలనని చూచుచూ ప్రచారములు జేయుచున్నచో మువ్వురును అవేరకమునకు పాత్రులగుచున్నారు. ఇవి వారిలో కేవలము ఆశయములు మాత్రమే యై యున్నచో లేక తామే భ్రమఫడి మోసపోవుచున్నారో కాక వోటులను పట్టుటకీ మాత్రములను గాలములుగా నుపయోగించుచున్నారో నిర్ణయించుకొనగల విచక్షణము చదువరులకే విడచి పెట్టుచున్నాము. అయినను ఈ విచక్షణము సరిగా జేసుకొనుటకు శాసనసభల తత్వమును బాగుగా గ్రహింపవలసి యున్నది. గనుక వాటిని గూర్చి యించుక ఆలోచించక తీరదు.