పుట:Garimellavyasalu019809mbp.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వయేజన విద్య

  విద్య యొక్క మహత్తు నెరిగిన వారెవ్వరు కాని వయోజన విద్యా సమస్యను ప్రస్తుతం భారతదేశంలో ఉన్నస్థితిలో విడిచి పెట్టజాలరు. నూటికీ తొంబది మంది నిరక్షరాస్యులై అక్షరాస్యులెందరో , యెప్పుడో చదువుకున్న స్వల్పవిషయముల నతి వేగం మరిచిపోవుచు, ఆధునిక విజ్ఞానములో వెనుకబడి ఉన్నయెడల భారతదేశము ప్రపంచ్జములోని యితర దేశములతో తుల్యమైన అంతస్థునకు ఏనాడు రాగలదు? మనప్రధాని రాజాజీ, మద్రాసులో విద్యార్ధిసభలో చెప్పినట్లు మన బారత జాతీయులు ఆతీర్మానలళోమన పూర్వపు విజ్ఞానము యింకను జీర్ణమై యున్నది. కనుకనే మనకు చదువులు రాకున్నా లోపము లేకుండా సంసారపక్షంగానైనా ప్రపంచయాత్రలో కష్టసాధ్యం మీద నెగ్గుకొని వస్తున్నాం. కాని లేకుంటే ఈ యుగధర్మమున్ బట్టి చదువురాని వారికి శవమునకు కంటె ఎక్కువగా గౌరవవం లేకుండా పోతున్నదన్న సంగతి మనము మరువరాదు.
ప్రపంచమంతా అక్షరాలు, అంకెలే
    కనువిప్పీవిప్పడంతో మనకళ్ళయెదుట అక్షరాలు, అంకెలు, బొమ్మలు, భోగట్టాలు ప్రత్యక్షమగుచున్నవి. చదువురానివాడికి, అంకెలు తెలియనివనికి, కళ్ళున్నప్రయోజనం కూడా లేకుండా పోతున్నది. రైలు, బస్సుటికెట్ల మీద పేర్లు, అంకెలు, ఇంట్లో వుంచామంటే తలుపుల మీద అంకెలు టైముతెలుసుకుందామంటే వాటి మీద అంకెలు, నాణెమైన బట్ట కొందామంటే మిల్లు చీటి ప్రత్యక్షం. పట్నంలో నాలుగు వీధులు తిరగాలంటే పేర్లు చదువుకోవాలి. కాంగ్రెసుమంత్రివర్గం వచ్చి మధ్యపాననిషేధ, గ్రామ  పునర్నిర్మాణప్రచరములను చిత్రవిచిత్రమైన నీతి వాక్యములు అంకెలతో సాగిస్తున్నారు. సాగించబోతున్నారు. వానిసారమును గ్రోలవలెనన్నా అక్షరాలు, అంకెలు తెలియాలి చదువురాకుంటే అరక్షణమైనా కళ్ళు విప్పుకొని నడవలెని పరిస్థితులేర్పడు చున్నవి. ఇప్పుడు కూడా మనపూర్వుల నాటి జ్ఞానవైరాగ్య పద్దతిలో మునిగి ఆమత్తు మరిగి సారస్యము గ్రహించలేక ఈ ప్రపంచ జ్ఞానములో తేలదామనే సమస్య మనము నిర్లక్ష్యం చేసే లాగుంటే (మనకు జ్ఞానం సరిపోతుందికదా). ప్రపంచంలో మరు
  గరిమెళ్ళ వ్యాసాలు