పుట:Garimellavyasalu019809mbp.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దినం కూడా వెళ్ళదు.

కనిష్ట పరిణామ జ్ఞానం
  అయినా విజ్ఞానమంటే అక్షరాలు, అంకెలు, తెలుసుకోవడం పంచిపెట్టబడే సినిమా అడ్వరుటైజుమెంటు పేపర్లు మొదలగు వానిని కూడబలుకుకోవడం మాత్రమే అని నాఉద్దేశ్యంగాదు. ప్రపంచములో మానవ తుల్యంగానైనా నివసిద్దాంతమంటే మనకీ మాత్రం జ్ఞానమైనామొట్టమొదడ అత్యావశ్యకమని నాభావము. మానవ విజ్ఞానమునకు, ఇది పుట్టగీటు ఆ కనిష్టపరిణామజ్ఞానముంటే ఆ తరువాత మెట్టు ఏదైన మనకు అందుకు వస్తుంది. లేకుంటేనే ఈ మట్టుకు కూద క్రిందుగా మనము ప్రాకుతూ వుండవలసిన వారమే. ఇందుకోసమే నిరక్షరాస్యత క్రూర పిశాచముల కంటె కూడ ఘోరమై తక్షణమే తరిమివేయవలసిన పెనుభూతము వలె నేడు మనకు కనిపించుచున్నది. విద్యలో ఒక రహస్యమున్నది. మానవ్లకు ఆరుచిని మప్పే దాకానె కాస్త కష్టం కావచ్చును కాని, ఒకసారి రుచిని మరిగిన వారు మరి దానిని విడువజాలరు. అక్షరజ్ఞానం నేర్పి చిన్న చిన్న పాఠములు చదివించి ప్రాధమికవిద్యను ప్రజలకు ఉత్సాహవంతముగా ఒకసారి నేర్పే దాకానే కాస్త కష్టం కావచ్చును కాని, తరువాతను వారే స్వయంకృషివల్ల పత్రికలను, గ్రంధములను చదివి ప్రపంచ పరిణామము నంతటిని గుర్తించుదురు.
     పరిపాలనము మన చేతులలో పెట్టబదినది. ప్రభుత్వ దర్మమును ప్రజలు గుర్తించి తదనుకూలురైన వారికే ప్రజలు వోటు నియ్యవలసి యున్నది. తగాదాకలుగకుందాను, అధవాకలిగినా, కోర్టునెక్కకుండా గ్రామాలలో పరిష్కారమయ్యేటట్లుగాను ప్రజలు వర్తింపవలసియున్నది. పంచాయితీలను, సహకార సంఘములను వారు నడిపించుకోవలెను. సభలలో వర్తింపవలసిన సూత్రము లెరుగక సంతలలో వలె గోలచేసి పోట్లాటలకు దిగుచో పోలీసు సహాయము పిలువవలసి వచ్చునేమో ఈ విషయము లన్నింటికి సంబంధించిన విజ్ఞానము వరిలో ప్రచారం కాకుంటే బండి నడవగలదా!