పుట:Garimellavyasalu019809mbp.pdf/94

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అందుకుకూడ బాహ్యలగుచున్నారు. వీరికి చేయూతనిద్దామనే ఆసక్తి ప్రజలకు గాని, ప్రభుత్వమునకు గాని కొంచెమైనను నేటికిని కలుగకుండుట పూర్తిగా శోచనీయము. ప్రభుత్వము వారికీ సంగతి వివేదించుకొన్నచో ఇది ప్రభుత్వధర్మముకాదు ప్రజల బాధ్యత అందురు. ప్రజలకిఈ సంగతి నివేదించుకొన్నచో, ఇది ప్రభుత్వ కర్తవ్యము కాని, ప్రజలను పీకుకొనితింటే యేమి పుష్టి అందురు. మన రాష్ట్ర టెక్ట్సుబుక్కు కమిటి వారు డా॥పట్టాభి సీతారామయ్య డా॥జె.సి.కుమారప్ప గార్లు వ్రాసిన గ్రంధములనే త్రోసివేసిరి. దానిని బట్టి సామాన్యులకు ప్రోత్సాహమెక్కడ ఉండగలదో గ్రహింపుడు.

ప్రజాయుత్త ప్రభుత్వ ధర్మము
   మన రాజులు, చక్రవర్తుల పరిపాలనములో, సాహిత్యమునకును, విజ్ఞానమునకును రాజాదరణము ద్వారా విస్తారమైన తోడ్పాటు కలిగిందన్న సంగతిని మనము మరువరాదు. రోజుల నాదర్శముగా చేసుకొనియే, అమాత్యులు, జమీందార్లు, శ్రీమంతులు, సర్వులు సాహిత్య విజ్ఞానములకు నిరుపమానమయిన చేయూత నిచ్చుచుండెడివారు. ఇప్పుడు వారికీ ధోరణి లేదు. నేడు సర్వదేశములు భారతదేశము కూడ, ప్రజా ప్రభుత్వమయము లేక ప్రజాప్రతినిధుల ప్రభుత్వమయములై క్రొత్త వన్నెలు నీనుచున్నవి. ప్రజలకే రాజత్వము సిద్ధించుచున్నది. పూర్వమువలె కాక, నేడు ప్రజలు తమ విద్య్హను, సౌభాగ్యమును, సంపదను, బలమును, సర్వమును ప్రభుత్వము నందే కేంద్రీకరించుకొని, ఆ ప్రభుత్వమిచ్చెడి సహాయ సంపర్కమున్నంతవరకు వర్థిల్లుచు లేనంతవరకు వెనకపడుచున్నది. ఈవైజ్ఞానిక యుగములో కేంద్రీకరణ యుగములో యిది తప్పని సరి యగు;చున్నది. ప్రభుత్వాదరణము, కేంద్రీకరణము తీవ్రముగా ప్రారంభమయి నప్పటి నుండియు ఆ ఆదరణము గల సంస్థ లెవ్వియో వర్ధిల్లు .చున్నవి. లేనివెల్లయుక్షీణించుచున్నవి.  వీనికి సాయము చేయ వలసిన పని మీదికాదని ప్రభుత్వమువారు వెనుకకు తగ్గుట దేశమునకు శ్రేయమే కాదు. ఎన్నో విధములయిననూతన సంస్థలను ప్రస్తుత ప్రభుత్వములు నెలకొలిపి చేయూత నిచ్చి స్వయం వ్రవర్ధమానములయ్యే దాకానైనా సహాయం చేస్తున్నరు. విద్యాసంస్థల యెడల. అందులోనూవయేజనవిధ్యాసంస్థల యెడల్;అ వారి ఆదరణము మరీ యెక్కువగా ఉన్నాయి. అని ప్రపంచ చరిత్ర తెలియజేయుచున్నది
గరిమెళ్ళ వ్యాసాలు