నాయకత్వములు గాలిలో నెగిరిపోవునోయని భయము. ఉద్యోగములూడిపోవునో అని భయము. నిజమైన సత్యాన్వేషు లెప్పటికిని ఉండనే ఉందురు. ఒకప్పుడు తామేదో మాట అన్నాము కదా అని ఊరుకొనక, భావము మారినప్పుడు క్రొత్తదానిని చెప్పుచునే యుందురు. రాజకీయ నాయకత్వమును పాటింపరు. ప్రపంచ ప్రశంసల కొరకు తూగులాడరు. ఉద్యోగములు పోయినను సరకు చేయరు. నిదానము మీద అట్టివారి మాటయే నిలుచును.
ప్రస్తుతం, ఆంధ్రదేశము నందుగల ప్రతీసమస్యను ఈ రీతిని తర్జన భర్జన చేసి నిజమును నిరూపిస్తూ బోధించగలవారు అవసరం. ఇందుకై వారు ఒక రాజకీయములేమి, ఆర్థికములేమి, సాంఘికములేమి, శాస్త్రీయములేమి, ఆధ్యాత్మికములేమి, సమస్త సమస్యలను పరిశోధనము చేసి తేటతెలుగులో వారి భావములను వ్రాయుచుండవలెను. ఆంధ్రదేశమిప్పుడీ యుగములో తేలుచున్నది. కవీశ్వరులీ గీతములను పాడుచున్నారు. వక్త లీ ప్రసంగముల నల్లుచున్నారు. విద్యాశాలలు వీనిని తమ ప్రణాళికలో చేర్చుకొనజూచుచున్నవి. రాజకీయ వాదులీ మార్పుల నాచరణములో పెట్టుటకై ప్రయత్నించుచున్నారు. ఈ మాహాకల్లోలములో ఉత్తములైన వారందరికిని యే పదము, యే ధోరణి సులువైనట్లు కనిపించితే దానిని వాడి తీరుదురు.
ఇది కాక మనమిప్పుడు నేర్చుచున్న ఈ ఆధునిక విజ్ఞానమున కంతకును మనకు మాతృక ఆంగ్లభాష. దాని పోలికలు, వాసనలు, పదములు, పరిభాష వద్దన్నను మనకు తప్పదు. అదే యిప్పటి రాజకీయ భాష, ఏలక్షనుల భాష, వైధ్యబాష, సహకారుల భాష, శాసనకారుల భాష, జనులందరికిని దీనిని గూర్చిన ఆంగ్ల పదములు నోరు తిరుగునట్లు తెలుగు, సంస్కృతం తర్జుమాలు నోరు తిరగవు. ఆంధ్రదేశము బహువిశాలమైనది కన్నడ భాషా ప్రాంతీయులకు అనేక కన్నడ పదములు ప్రయోగములు, అరవ భాషా ప్రాంతీయులకు కొన్ని ఉరుదు మర్యాదలు, తమ స్వంత భాషలోని వానివిగానే అల్లుకొని పోయినవి. ఇదీ కాక మండల భాషకును, యాసకును భేదమెంతో కొంత ఉండనే ఉన్నది. రెయిళ్లు లేని కాలములో, పరిచయములు తక్కువైన కాలములో ఇవి ఒక దాని కొకటి సవతి బిడ్డలవలె కనిపించుచుండవచ్చును. బ్రిటిషు గవర్నమెంటుధర్మమంటూ, కాంగ్రెసు ధర్మమంటూ, ఆంధ్రనాయకుల ధర్మమంటూ, ఆంధ్రమంతా ఒకే
78
గరిమెళ్ళ వ్యాసాలు