పుట:Garimellavyasalu019809mbp.pdf/89

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పత్రికలు బహిష్కరించినంతమాత్రమున వాని ప్రత్రిభ కొరత పడదనియు, వానియెడల జనసామాన్యమునకు నిజమైనఆసక్తి ఉండుచునే యుండుననియు మనము ఖచ్చితంగా చెప్పవచ్చును. కాని వానికి తీరిక సమయములందలి విలాసములకు తగినంత స్థానమును మాత్రమే యివ్వవలెననుట యు సమంజసమే. నేడుజాతులభావము లెల్లయు మహందోళన ముతో తల్లడిల్లుచున్నవి. ఆంధ్రజాతి భావములును నట్లే యున్నవి. పంటలెంత యెక్కువైతే కాటుక యంత యెక్కువగుటకు విజ్ఞాన (Science) యెంత యెక్కువైతే ఆజ్ఞానమంత యెక్కువగుటకు,కోర్టులెంత యెక్కువైతే నేరములన్ని హెచ్చుచుండుటకు, సైన్యములెంత వృద్ధి యైతే అశాంతి అంత వర్ధిల్లుటకు కారణము లెవ్వియో ప్రజలు తెలుసు కొనుటకు తల్లడిల్లి పోవుచున్నారు. ఈ మహా రహస్యములు బట్టబయలు కానిదే ప్రపంచవాసులందరికినీ నిజమైన శాంతి కాని సౌఖ్యముకాని కలుగనేరదు. ఒక్కొక్కరొక్కొక్క సిద్దాంతమును పట్టుకొని యుద్ధమునకు వచ్చుచున్నరు. ఈ మహాకల్లోలములో శాంతి నెలకొనగలదా యను ఆశకూడా అంతరించుచున్నది. ఈకల్లోలమెంత వృద్ధి యైతే విప్లవ వాదులంత మంచి దంటున్నారు. దీనిని చూచీ చూడడములో శాంతివాదులు బెగ్గ్లిపోయి తమ పురాతన పద్ధతులను మరించ కట్టుదిట్టము చేసుకొనుచున్నారు. ప్రతీవరమునందును పైకి యెంత మేలు కనిపించితే లోపల నంత గుల్ల యున్నట్లు స్పష్టముగ కనిపించు చునే యున్నది అయినా, సిద్దాంతాలు ఆ మాటకు ఒప్పుకొనకున్నారు. ఈ విషయములను గూర్చి నిష్పాక్షికముగా ఆలోచించి ప్రజలకు సత్యమును నిరూపెంచవలసిన బాధ్యత ప్రతి విద్యాధికుని యందును గలదు.

   అయినను ఈ ప్రచారము కూడా అంతసులభసధ్యమైనట్లు కనబడదు. ఒకప్రక్కన ప్రభుత్వముల నుండియు వేరొకప్రక్కన ప్రతిపక్షముననుండియు అట్టివారిపై దోషపరంపరలైన శిక్షణలో దూషణలొ కురియుచునే  యుండును. ఎవ్వరి విశ్వాసము లెట్లాటి వైనను, తీరా నొరు విప్పేటప్పటికో, కలం తీసేటప్పటికో, పూర్వాపరసంశుద్ధికొరకో, కొందరికి అహితముగా ఉండకుండుట కొరకో, తద్వ్యతిరేకమైన వాక్యములను తెలుపవలసివచ్చు చుండును. మనసులో ఉన్న మాటంతా పైకి చెప్పితే చాలును. అనెకులకు తమ రాజకీయ