పుట:Garimellavyasalu019809mbp.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తలంప జెసి అట్లే మాట్లాడుట అభ్యాసము చేసుకొని నట్లు చేసినారు. నేడు యెన్ని తప్పులు ఎన్ని అవకతవకలైనా పడి ఆ గిరులలోనే కొట్టుకొందామని చూస్తున్నది. కాని దిగుతామని కోరిక ఉన్నా చాని స్వస్థానమున కది రాజాల కున్నది. మహామహోపాద్యయ బ్రహ్మశ్రీ ఆచంట వెంకటసాంఖ్యాయన శర్మ గారంతటివారు. "గిడుగు రామమూర్తి పంతులు గారు చెప్పినట్లే కావచ్చును వారు భాష యొక్క శ్రేయస్సునూహించి కృత్రిమమని అనుకోకుండా ఆకృత్రిమము నొనరించినవారే యనుకొందము. అది దేశమునకు మేలుగనే పరిణమించినది. అది వ్రాత కలవాటయినది. మావంటి వరము యుపన్యాసాలను కూడ అట్లే యిచ్దుచున్నాము. ఇప్పుడు దాని మీదికి తిరగబడి మునుపటి స్థితికి పొవలసినంత అగత్యమేమి? యని సేలవిచ్చినారు.

   మనము తిరుగుబాటు చేసి తొల్లిటి నుండి అనుశ్రుతముగా వచ్చుచున్న స్థితికి రాగలుగుదుము. రాలేకపోదుము పదియేండ్ల వరకును తెలుగుభాష నేర్చుకున్న తెలుగు కుఱ్రవాడు ఆ తరువాత అరవ దేశము వెళ్లి తెలుగు నేర్చుకొని, తనది ఒకప్పుడు శుద్దమైన తెలుగన్న సంగతే మరచిపోయినాడు. తనెదే మేల్తరమగు తెలుగనుకొనుచున్నాడు. చాలా కాల మట్లే అలవాటగుట చేత తన దేశపు తెలుగును తిరిగి నేర్చుకొనగల అవస్థను దాటిఫొయినాడు. అయినను ఎవరైన వెళ్లి "తమ్ముడూ నీ పూర్వపు తెలుగు ఇదికాదురా, అదిరా దానికలవాటు పడురా" అని  ఉపదేశిస్తే వాడికి నచ్చితే కూడా వాడి తొల్తటి తెలుగుకు రాలేడు అయినా వాడా తెలుగు అని తెలుసుకొనుట వాడి కానంద దాయకముగా నుండక ఫోదు.
వాడుకభాష యొక్క భవిష్యద్భాగ్యము
     మే మెవ్వరమును ఇప్పుడట్టి అకాల్పనిక సహజ మధుర భాషను, ఈ కూసు విద్య నేర్చుకొన్న కతమున వ్రాయజాలకున్నను మన భాష కొక్కప్పుడట్టి యకృత్రిమ మాధుర్య ముండెను గదా యన్న ఆనందము లేకపోలేదు. ఒక్కసారిగా మే మా ముచ్చట లూరెడి మంజుల శైలికి రాజాలకున్మాము. రాగోరుచు గ్రాంధికములోనికి నడుచుచున్నాము. కాని వాడుక భాషయును తత్ప్రయోగములును వాటంటత అవియే మా కలముల లోనిక్ పోవుచున్నవి.