పుట:Garimellavyasalu019809mbp.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పుస్తకము నైనను చదివి అభ్యసించుకొనవచ్చును. కాని సులభశైలి నిర్ధుష్టముగా భావములను విప్పి చెప్పగలుగుట మొదలగు నేర్పులు చిక్కుటకు చిన్నయ్యసూరిగారి వంటి గ్రంధములు చదువ నవసమేలేదు.

వాడుకభాష నెట్లు చంపిరి

     కాక పంతులు గారు మరి యొక్కటి చెప్పుచున్నారు. అదియును మాకు సాధ్యమని తోచుచున్నది. తెలుగు గద్య కావ్యములకు, చారిత్రక గ్రంధములకు, ఆంధ్ర భాషలో ననుశ్రుతములుగా వచ్చుచున్నది వాడుక భాషా శైలియే యనియు చిన్నయ్యసూరి మొదలగు పండితులు వ్యవహారిక భాషయే మహా అపరిశుభ్రమైనట్లు భాషకు పరిసుద్ధత నిచ్చుకొనుటకు తన వ్యాకరణము ప్రకారము ప్రాత గ్రంధములలోని అకాల్పనిక శైలిని తన వ్యాకరనము ప్రకారము దిద్దెననియు, తన ప్తాత ప్రతులను గూడ ఈ సూత్రముల ప్రకారము దిద్దుకొనెననియు వారు చెప్పుచున్నారు. వారు సంగ్రహించుకొని యుంచుకొనిన పై కధల పుస్తకములు మొదలగు వాని నెల్లచూపి తమ సిద్దాంతమును వారు స్దిర పరచుచున్నారు. వసుచరిత్ర, భారతము మొదలగు మహాగ్రంధముల యొక్క పురాతన పండిత వ్యాఖ్యానములలో నీ వాడుక భాషాప్రయోగములే ఉన్నవి. వారికి గ్రాంధిక భాష రాదనరాదు. అవి అన్నియు అచ్చు తప్పులేయని త్రోసి వేయరాదు. అప్పటి చరిత్ర గ్రంధములును శాసనములును ఇంకను ఆ భాషలోనే యున్నవి.
    అయిననేమి చిన్నయ్యచూరి పందెమును ఇప్పటి పందితుల పందెమును నెగ్గినది అప్పటి అనుశ్రుతముగా వచ్చుచున్న దగ్య భాషను వారరికట్టి పద్య కావ్యములలోని వచన భాషకు మానవజీవిత వ్యవహరములలో నమలులో లేని గ్రాంధిక ప్రయోగముల భాషకు పట్టాభిషేకము చేసి, వ్యాకరణము వ్రాసి, మన యూనివర్సిటీ వారి సహాయముచే దానిని ప్రతిష్ఠించిరి. ఆంధ్ర విధ్యాధికులకు కూడ ఈ పాతపాలలవాటయి చంటిపాలు అంటూ ఒకటి ఉంటాయనే జ్ఞానము లెకుండా చేసినారు. ఆకృత్రిమ శైలిలో వ్రాయుటయే ఒక కాడికి సులభముగను, గద్యము వ్రాయవలసిన వాడుక భాషలో వ్రాయుట కష్టముగను చేసినారు. కొక్కొడ వెంకటరత్నం పంతులు మొదలగు వారి చేత నదియే యుత్తమ భాష కనుక యింట్లో కూడ నట్లే మాట్లాడవలయునని