పుట:Garimellavyasalu019809mbp.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈ కవిత్వములలో వాడుక భాషకు గల స్థానము

  ఇక వీటిలో ప్రయోగించెడి భాషను గూర్చి యించుక చెప్పవ. లసియున్నది. ఒక్క పద్యకవిత్వము నందును భాషకవిత్వము నందును తప్ప నన్నయచిన్నయ్యసూరిగార్ల వ్యాకరణముల నిబంధనలకు లొంగియుండవససిన యావశ్యకము మరి దేనికిని లేదు., వ్యావహారిక గ్రాంధిక భాషా మిశ్రమము వాటిలో ననుశ్రుతముగా వచ్చుచున్నది. దాని ననుసరించియే యని యెల్లయును పోవచ్చును. భాష యొక్క గాంభీర్యము చెడకుంద గూద భావములు కూడ వహించగలుగునంత ఔన్నత్యమును, అవి సులువుగా గ్రహింపగలుగుటకు తగినంత వాడుక సిద్ధియును వాటికున్నచో చాలును. పాత్రౌచితిని బట్టి వీటిలో నెచ్చు తగ్గులుండవచ్చును.  కేవలం గ్రాంధికత్వమున కాశించి కష్టముగను అసహజమౌగను చేయకూడవచ్చును. కేవలం గ్రాంధికత్వమున కాశించి కష్టముగను అసహజముగను చేయకూడదని కేవలం సులభత్వమున కపేక్షించి హేయముగను వికారముగను చేయకున్నచో చాలును. మన ఆంధ్ర దేశములో జిల్లా కొక్కొక్క (district) పరిభాష యున్నదనియు, ఒకరి భావము లొకరికి తెలియవనియు వాదించెడి భావమునకు మేమెప్పుకొనము. ఒక జిల్లా కింకొక జిల్లాలో పరిచయము తక్కువగా నున్నదనియు, అందుచేత నొకరై వాడుక భాష యింకొకరి వాడుక భాష నుండి కొంచెము భిన్నముగ నున్నదనియు మే మొప్పుకొందుము కాని, ఆభేద మోరి ధోరణి యింకొకరికి తెలియునంతటిది కాదు. పరస్పర సంచారముల వల్న అవి అబగ్రహణము కాగలవు. పదును కాగలవు. వాటిలో ననేకములు గ్రంధములుగా జేసి గౌరవము నిచ్చుటకు తగియున్నవి. ఈ పని8ని మన మిప్పుడు మానివేసినచో వాడుక భాషా భేదౌలే మరియును పెద్దవై, ఒకరి భాష యొకరికి తెలియక, ఒకరితో ఒకరు గ్రాంధికముగా ననగా నన్నయభట్టు వెలెనో, పెద్దన్న వలెనో తప్ప మాటలాడుకొనుటకు వీలు లేక, అంత పాండిత్యము లెని వారు వేర్వేరు జాతులై, బొంబాయి తెలుగులు, ఆంధ్ర తెలుగులు, తంజావూరు తెలుగులు, తెలుగు తెలుగులువని వేర్వేరులై క్రమముగా తెలుగు రూపుమపి అచ్చటచ్చటికి సమీమపులలో నున్న బలవద్భాషలలో మిశ్రమమై పోయి అద్చటచ్చటి వారా యా భాషలను మాటలాడుకొనక తీరదు. ఇట్టి గతియే  బొంబాయి లోని తెలుగు వారికిని అరవ దేశము తెలుగు వారికిని పట్టినది. వెల్లూరు,