పుట:Garimellavyasalu019809mbp.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బళ్ళారి, కర్నూలు, చిత్తూరు, మొదలగు జిల్లాల వారికిని క్రమముగా గుంటూరు వారికిని గూడ అట్టి గతులే పట్టవలసి వచ్చును. గనుక ఆయా జిల్లాలలో ప్రజల ప్రచారములో నున్న వాడుక భాషను, వాడుక భాషా రూపుములను గ్రంధస్థములు చేయుట వలన వచ్చెడి నష్టము లేదు సరిగదా, లాభమధికముగా నున్నది. శబ్ధజాల మెక్కువయియినను, ఇరుగు పొరుగు వారల లక్షణములు, మాటలు తెలియును. ఇందుకు హరికధలు, భాగవతములు, యక్షగానములు, బొమ్మలాటలు, పాటల కంటె నెక్కువ ఉచితమైన సాదనములు స్థలములును వేరెవ్వి? ఇదియును గాక వీటి కనుశ్రుతముగా వచ్చుచున్న సంప్రదాయమును మాని వీని నన్నింటిని గూడా భారత భాగవతాదుల ప్రక్కలో గూర్చుండ బెట్టవలె ననుటలో అర్ధము లేదు. ఇక ఆధునిక కవిత్వమును భావగీతములలోనే అవి యెల్లయును ప్రయోగించుకొనుటయా మానుకొనుటయా అనునది కవి గారి యిష్టము ఆయన మాత్రముచితజ్ఞడు కాడా! మన పూర్వులు ప్రబంధకవిత్వములో గూడ నట్టి స్వాతంత్ర్యమును క్వచిత్తు క్వచిత్తుగా తీసుకొను చిండిరి. ఇప్పుడు మనవారు కూడా తీసుకొనుచున్నారు. అట్లు తీసుకొనుటలో తప్పేమియు లేదు. అసలులో ఈ గ్రాంధిక వ్యావహారిక భాషా వివాదము గద్యరచనకు మాత్రేమే సంబందించినది. హరికధాదుల కిది కొత్త కాదు. అందులో రెండును కలియుచునే యున్నవి. పద్య కవిత్వము దీనిని విస్తారమంగీకరించి యుండలేదు. క్వచిత్తుగా అప్పుడప్పుడును ఇప్పుడును కూడ నంగీకరించు చున్నారు. గద్యముచే యిట్లా? అట్లా? వ్రాయుట యని వివాదము లేచినది. అయినను ఈ వివాదము యొక్క తరంగములు పద్య కవిత్వము మీదికి కూడ ప్రాకి యీ వాడుక పదములందులోని కెక్కువగా వచ్చుచున్నది. దీనికి గారణ మీ వాదము యొక్క మూలపురుషులలో నొకరగు గురజాడ అప్పారావు గారు కవి కూడనై తన ముత్యాల సరములలో నుంచి యితరములలోనికి గూద ప్రాకజూచుచున్నది. కాని తక్కిన వృత్తముల లోనికి గాని పద్యాలలోనికి గాని యింత జోరుగా ప్రాకుటకు, వీలు లేదు. ముత్యాల సరములను పద్యము లనుటకంటె పాట అనవలెను. ఇట్టి చందస్సులే తెలుగు చందస్సులనియు, కందము, ఉత్పలమాల మొదలగునవి అసలు తెలుగు చందస్సులు కావనియు, వాటిని గైకొన రాదనుటయు