తయారయినవి. నానాటికి ధాన్యం పంట, బట్టల పంట, కుండలపంట, గిన్నెల పంట కంటే ఈ కేసుల పంట ఉత్పత్తి హెచ్చవుతున్నది.
ఏ వకీలును చూచినా, జడ్జిని చూచినా ఉపన్యాసకుని చూచినా అసత్యమును ఖండించి న్యాయమును నిలబెట్టాలని ప్రార్థించి ఉపన్యాసాలిచ్చే వారే కాని, ఈ నేరమునరిగట్టటానికి యెవరికినీ దమ్ములేకున్నది. ఈ పంట తగ్గితే వీరికెవరికీ తినడానికి మెతుకులుండవు. త్రాగడానికి నీళ్ళుండవు. తిరగడానికి పరువుండదు. ఇవన్నీ ఇట్లు అమలు జరుగుతూ, వీటివల్ల వీరికి జీవనోపాధి దర్జాలు జరుగుతూ, ఖండనోపన్యాసాలిస్తూ వుంటేకాని లోకమరమ్మత్తుకు అవకాశం యేర్పడదు మరమ్మత్తులోకం కోసం కాక లోకమే మరమ్మత్తు కోసం అనే వృత్తి యేర్పడడం వల్లనే నేటి న్యాయస్థానాదులు, విద్యాసంస్థలు, ప్రభుత్వోద్యోగాలు, ప్రభుత్వ విధానాలు, సినిమాలు మొదలగు విలాస సౌకర్యాలు కూడా ఇటువంటి వక్రపథములను త్రొక్కుచున్నవి.
నేటి పిన్నలే రేపటి పెద్దలు. నేటి విద్యార్థులే రేపటి పౌరులు ఉద్యోగులు నాయకులు మొదలగువారు నేటి సంతతులే, రేపటి తరాలవారికి పితలు పితామహులు ప్రపితామహులు ఈ విధానాలవల్లనే మనము భవిష్యత్ శ్మశాన ప్రపంచమునకు పునాదులను వేయుట, ఆత్మవిమర్శన చేసుకొనుట కవకాశము కలిగించుకోవలదా? ఏ రోజు గొడవ ఆరోజు యెల్లాగో ఒకలాగా తీర్చుకోవడమే ప్రయోజత్వంగా భావించి కుళ్ళీ కుతమరుతూవుండడానికే మాతృగర్భములను చేదించి మన మీ లోకమున నవతరించినది! ఈ సమస్యల నెవరైనా తీవ్రంగా ఆలోచించుచున్నారా? ఆలోచిస్తే పరిష్కారం దొరకకపోవడం దుస్సాధ్యమగుచున్నదా? లేక అట్టి ఆలోచన కూడా కపటముగానే జరుగుచున్నదా?
ఇందులో ఎవరి నేమి అనడానికి వీలులేకున్నది. అందరూ పట్టభద్రులు, ఉన్నతోద్యోగులే. అందరూ ప్రధాన మంత్రులు ఉపప్రధానులే, కానివారు అట్లు రేపవుదామని యత్నిస్తున్నవారే. అందరూ వేదాంతపరులు, తత్వజ్ఞులు, ఉపన్యాసకులే. ఆచరణలకు, ఆలోచనలకు ఆలాపాలకూ ఎక్కడా మేనమామ మేనత్త సంతతుల పోలికలైనా లేకున్నవి.
గరిమెళ్ళ వ్యాసాలు
171