పుట:Garimellavyasalu019809mbp.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అనుమానం కలిగితే వారి కనుకూలంగా తీర్పుచెప్పడం, ఇట్టి తీర్పులు తరువాత కేసుల తీర్పులక్ వరవడులు కానడరాఇనీ ప్రస్తుత న్యాయస్థాన విచారణం చర్యల వరుస.

      ఈ మహా సంరంభంలో సత్యం గెలవడాని కెట్టి అవకాశాలూ లేవు. ఏవకీలు బుద్దిమంతుడైతే అతడు ఎంత అవకతవక కేసునైనా బహు చక్కగా సత్యమెట్లు తయారు చేసి సాక్ష్యాలద్వారా బలపరచి జడ్జీని కనుబ్రామి కేసు గెలిపించవచ్చును. చేతకాని సత్యసంధ వకీలు చేతిలో పెడితే యెంత న్యయమైన కేసైనా ఓడిపోవక తప్పదు. ఈ విధంగా బుద్దిమంతులైన వకీళ్లు త్వరలో శ్రీమంతులవడానికి బుద్దిహీనులావృత్తిలో చచ్చీదాకా ఈడ్చుకుంటూ ఉండడానికి దారి యేర్పడినది.
      కేసు గెల్చినా ఓడినా ఉభయ పార్టీలకు ఖర్చుల క్రింద పిత్రార్జితపు పిసరూపిప్పి ఊడిపోయి ఫకీర్లవడం తప్పదు. ధర్మానికి సాక్ష్యం చెప్పే సాధువులను సత్కరించే పార్టీలంత కంటె లేవు. ఎంత పెద్ద అబద్దసాక్ష్యం చెప్పాలంటే  అంత ఫీజు ఇచ్చుకొవలసిందే, ఇటువంటి యుగంలో కష్టపడి పనిచేస్తేను. కవిత్వం, చెపితేను, చిత్రం వ్రాస్తేను, హరికధ చెపితేను, చిత్రం వ్రాస్తేను, హరికధ చెపితేను వచ్చే ఆదాయం అత్యదికం అయింది.
  ధర్మచింతన తగ్గి ధనచింతన హెచ్చుతున్న ఈ దినములలో సాక్షివాదము నేకైకవృత్తిగా పెట్టుకున్న కొన్ని వర్గాలు యేర్పడినవి. మామూలు మనుష్యులయితే బోనులో నిలబడి మాట్లాడేటప్పుడు అవతల పార్టీవారు అడ్డు ప్రశ్నలు వేస్తే నిజం చెప్పియో అబద్ధం చెప్పియో బోల్తాకొట్టేస్తారు. కాని సాక్ష్యవాద ప్రవీణులు చెక్కు చెదరక అన్ని అడ్డు ప్రశ్నలకును అడ్డుజవాబులు చెప్పుతూ యెక్కడా దొరకక, తమ పార్టీవాదమును  గెలిపించే గలుగుగున్నారు. ఇట్టివారు ఎక్కువ ఫీజు అడుగుతున్నారంటే ఆశ్చర్యం కాదు.
   ఈ విధంగా నేదే గ్రామము నగరమ్ను చూచినా ఇట్టి అబద్ధం కేస్లుల నిర్మాణమునకు అబద్ధ సాక్ష్యముల నిర్మాణమునకు పెద్ద ప్యాక్టరీలుగా