పుట:Garimellavyasalu019809mbp.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పెట్టుకొని కొట్లాడుకొనేలాగుంటే మానవజాతి యేనాడో అంతర్ధాన మయ్యేది. ఆరీతి సమరసమైనా ఆనాటి ప్రజలలో అలరారే దంటే దానికి కారణము ఆ ప్రజలు కేవలమైహిక భొగా యత్తులు కాక ఇతర రకములగు పెక్కు ఆసక్తులతో హత్తుకొని యుండుటయే.

  అప్పు డెవడేవృత్తి ఛెసినా అది తన ధర్మము లేక కులధర్మమని భావించుకొనే వాడుగాని, దానివల్ల తాను శ్రీమంతుడను కాగలనా లేదా యన్న ప్రశ్నను వేసుకొనేవాడు కాదు. అందువల్ల కొన్ని వృత్తుల వారికి (కోమట్లు మొదలగువారికి) ధనము ఎక్కువగా లభించినా తక్కిన వృత్తులవారు ధనాశా పరాయణులై తమ వృత్తులను వదలేవరు కారు. ఏ వృత్తి లేక పోయినా తక్కిన వృత్తులన్నిటివారి పనికూడా ఉత్తుత్తియే అగునని గుర్తించి, పైవాళ్ళు క్రింది వాళ్లను ఆదరించడం మానకుండుటే గాక, గౌరవంగా కూడా చూసేవారు. అందువల్ల అందరూ తమతమ వృత్తులను సగర్వంగా ఆచరిస్తూ ఇతరులను చూచి ఈర్ష్యలు పొందక తం వృత్తివల్ల కలిగే ఫలాలను ఇతరవృత్తులవారు యధేచ్చగా అనుభవించడానికి సన్నాహులయ్యేవారు. ప్రపంచాభ్యుదయమునకు అట్టి సమరస భావమే ప్రశస్త సాదన కాని అన్ని వర్ణలు వర్గాల వారు ధన మనే మాయ లేడిని వేటాడడం కోసం ఒకరితో నొకరు పోటీపడి ఒకరినొకరు మ్రింగడమనే నేటి ఆధునిక ఆర్ధిక పద్దతి యే మాత్రమున్ను సబబైనది కాదు. పదిమందికి ప్రయోజనము కలిగించేదే అర్ధం కాని జనులతో పోటీలు పెట్టి యుద్దాలు చేయించి రక్తవహినులను పారించే క్షుద్రధనము, క్షుద్రవాణిజ్యం, క్షుద్ర దురాశ అర్ధశబ్దమునకు అర్హములు కావు.
  నేటి అర్ధశాస్త్ర గ్రందాలన్నీఒక ప్రధాన సూత్రమును ఆధారం చేసుకొని ఆ పునాదుల మీద తమ సిద్దాంతాలన్నిటినీ నిర్మించుకోవాలి. ప్రయోజనముగా ఏ యొక్కని, యే అదిమంది, ఏ సంఘముయొక్క ప్రత్యేక ప్రయోజనము కాదనీ, బహు సంఖ్యాకుల కత్యంతామోదముకరమగు నదియే నిజమైన ప్రయోజనమనీ గ్రహించాలి.
  ఆదునిక అర్ధశాస్త్రాలు పాశ్చాత్య దేశాలలో క్రొత్తగా ఉదయించిన
గరిమెళ్ళ వ్యాసాలు