పుట:Garimellavyasalu019809mbp.pdf/177

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రోజులలో అర్ధం యొక్క పై విశిష్టార్దం అడుగంటినది. అర్ధమనగా మానవూ ప్రయోజనా ప్రయోజనములతో సంబంధం లేని వెండి, బంగారు మొదలగు లోహములు నాణెమ్లను అర్ధము స్థిర పడినది. ఎవరేపనిని చేసినా దానివల్ల లోకమునకు కలిగే శుభ పరంపరలమీది దృష్టిక్షీణించి తన కెంత యెక్కువ డబ్బు లభించునను పెద్ద చింత తగులుకున్నది.

  నాటినుంచి ప్రపంచములో మానవ ప్రవృత్తినుండి వృత్తులు అంతర్ధానమైనవని చెప్పవచ్చును. పూంజీదారు లాభం కోసం కర్షక కార్మికులు కూలీకోసం, ఉద్యోగస్షులు జీతాల కోసం, రాజులు పన్నుల కోసం, పనిచేస్తున్న వారే కాని ప్రజాహితం లోకక్షెమం అను మాటలు కేవలం మొగ్ము తుడుపు మాటలే.

ప్రజాహితం లోకక్షెమం, స్వధర్మం మొదలైన ఆశయాలతో కాకుండా కూలీకోసం, జీతం కోసం, లాభం కోసం యేదో ఒక రూపంగా వచ్చే డబ్బుకోసమే పనిచేస్తున్నామని జనులు భావించుట మొదలుపెట్టి రేని వారందరూ నీతి నియమములను గుంట పెట్టి గంట వాయింరనియే చెప్పవలను.

   ఈ గంటవాయించడం పాశ్చాత్య దేశాలలో నాలుగైదువందల సంవత్సరల క్రిందటప్రారంబమై బ్రిటిషువాని చాతుర్యం వల్ల ఒక కళగా పరిణమించింది. ఆ కళా ఫలితాలు కేవలం వారిలో మాత్రమే కేంద్రీకృతాలు కాక ఇతరదేశాలు కూడా సామ్రాజ్యాలు అనడానికి ఆధారభూతము లైనవి. ఈ సామ్రాజ్యదేశాలకు తమలో తమ కెన్ని ద్వేషాలున్నను ఇతరుల దోచడంలో అవన్నీ కలిసి కట్టుగానె పనిచేయును. ఇండోనేషియాలో డచ్చి చర్యను బ్రిటిషు, ఫ్రాన్సు మొదలైన దేశాలు సమర్దించడ్ం చూస్తే ఈ విషయం విశదంకాగలదు.
    ఈ ధనతత్వం కేవలం సామ్రాజ్య దేశాలకే వుంటుండి. పాలితదేశ ప్రజలకు ఉండదు అని మనము భావించరాదు. సామ్రాజ్యదేశల వాసన తగిలిన అన్ని దేసాలకూ, ముఖ్యముగా వాని పాలనకు లోనైన వలస దేశాలకూ ఆ దుర్గుణ మవలీలగా అంటుకుంటుంది. అందువల్లనే అవి
గరిమెళ్ళ వ్యాసాలు