Jump to content

పుట:Garimellavyasalu019809mbp.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దేశములు దేశములను నగరములు పల్లెలను నాగరికులు అనాగరికులను యెంత వరకు దోచుకొని విఱ్ఱవీగుట కవకాశము గలదో అంతయు ఇంచుమించుగా పూర్తియైనది. ఉన్నవారు లేనివారు ఉన్న దేశములు లేని దేశములు అని ప్రపంచము రెండు ఘోరవిభాగములుగ చీలిపోయినది. లేనివారు ఏమీ లేదోయి అని యేడుస్తూ వుంటే. ఉన్నవారు అంతా నాకొక్కనికే వచ్చేసింది కాదోయి అని ఒకరితో నొకరు తన్నుకొంటున్న తన్నుకొనలేకను యేడుస్తున్నారు. ఏడుపు లిద్దరికినితప్పలేదు. ఉబ్బరగా కొందరికి కోట్ల కొలది ధనము కూడినందువల్ల తక్కిన వారికి కళ్లుకుట్టి వారికాధనమెట్లయినను దక్కకుండాచేసి అందరికీ పంచేదామని వారు ఎదురుచూస్తున్నారు. తమ అన్యాయార్జిత సంపదను నిర్భాగ్యులెప్పుడు దోచుకొనిపోతారో అని శ్రీమంతులు ఆయుధములు తయారు చేసుకొంటున్నారు. మొత్తము పైని యెవ్వరికి కాని మనస్థిమితము లేదు. అన్నిదేశాలకు నగరాలకు శ్రీమంతులకు గుండెలు బితుకు బితుకులాడుతున్నవి. పెందరాడే పెద్దలంతా తెమలుకొని ప్రాత అత్యాచారములనుండి విరమించి గ్రామ సంస్కారమునకు నిర్మల న్యాయమునకు సంతృప్త బుద్ధికి దిగినారా సరే, లేకుంటే కాగల కార్యమును గంధర్వులే చేస్తారు. రష్యాలో వలె యేదైనా ప్రళయము వచ్చి పడుతుంది. బలవంతాన వచ్చే ప్రళయాలు బలంతోనే అనగా ఆయుధబలంతోను డిక్టేటర్ల దుర్ణయముల తోను జనుల భీతి అనుమానములతోను నిలబడవలసినవే కాని శాంతం మీద స్నేహం మీద నిలబడడం కష్టము. గాంధీ మహాత్ముడు రవీంద్రనాథ టాగూరు గారలు భారతదేశ ప్రాచీన సంప్రదాయములను నవీన సూత్రములతో మేళవించి షయిగాను శాంతినికేతనాశ్రమములద్వారా నగరముల దృక్పథములు మార్చి తన్నివాసులలో గ్రామ శ్రేయోవాంఛ నంకురింపచేసి నగరములకు నూతన సంస్కరణము నిచ్చి తన్మూలమున గ్రామనగరములమధ్య స్నేహభాంధవ్య భావములను నిలిపి రెండింటిని తరింపజేయుటకు సంకల్పించుకొని యున్నారు.

నూతన దృక్పథమననేమి?

నగరముల దృక్పథము మారుట అనగా అర్థమేమి? అట్లు మారినయెడల అవి గ్రామముల పురోభివృద్ది కెట్లు సహకారమును చేయగలవు? ప్రస్తుత

గరిమెళ్ళ వ్యాసాలు

149