పుట:Garimellavyasalu019809mbp.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నాగరికత ప్రకారము గ్రామములను దోచుకొక పోతే నగరములకు స్థానమే లేకున్నదిగదా. ఇట్టి స్థితిలో అవ్వబువ్వ అన్నట్లు నగరములు గ్రామములు రెండూ కూడా యెట్లు బాగుపడుటకు వీలు గలదు? అను సందేహ్ములు పెక్కురకు కలుగువచ్చును. కాని ప్రస్తుత వర్తక నాగరికతా దృక్పదమును కాస్త మార్చుకొని తిలకించినచో నగర గ్రామములను బద్ద శెత్రుత్వముతొ వర్ధిల్ల వలసిన అవసరము లేదని తేటపడగలదు. దేశ సంపద యనగ నగర్ సౌధముల ఔన్నత్యము కాదనిన్నీ గ్రామవాసుల సౌభాగ్య విలాసములే అనిన్నీ నగరములు గుర్తించవలెను. గ్రామములు క్షీణించుట ద్వారా నగరములకు వచ్చే శోభలు గర్హ్యములని భావించి వానిని మూజూచుటకు కూడ్ అవి అసహ్యించుకొనవలెను. గ్రామముల కోసం నగరములు కాని నగరములకోసం గ్రామములు కావని నగరములు నమ్మవలెను. ఈవిశ్వాసము బాగా నగరములలో పాదుకొనియున్నచో గ్రామపరిశ్రమలను నాశనము చేయు లక్షలకొలది ఫ్యాక్టరీలు నగరములలో నెలకొల్పబడవు. బోలెడంత పెట్టుబడిమీద వల్లమాలిన చౌక సరుకు నుత్పత్తిచేసి అవి గ్రామములలోకి యెగుమతి చెయ్యవు. దళారీ కమీషను కొరకై ఆశపడి విదేశీ వస్తువుల నింత యెక్కువగా దిగుమతి చేసుకొని తాము పాడై గ్రామములను పాడు చేసి యుండవు. ఫ్యాక్టరీ సరుకంత్ చౌకగ గృహపరిశ్రమల సరుకు ఉండజాలదని గుర్తించి, కాస్త యెక్కువ ఖరీదైనా చెల్లించి మోటుగా వున్నాసరే గ్రామాల వస్తువులనే అవి కొనుక్కొని, వాని నుండి వచ్చుచున్నపంటలను తాము తినుచున్నందుకు వాని ఋణమును కొంత తీర్చుకొని సార్ధక్ జన్ములమైనామని భావించి యుండును. నగరములు నేడు గ్రామములను పలువిధములుగా దోచుకొనుటయే గాక, గ్రామములోనే గ్రామ ద్రోహులగు చిల్లరవర్తకుల నెందరినో నెల్కొల్పి గ్రామ పరిశ్రమలను చూపుచున్నవి.

    దేశమునకు కీర్తి తెచ్చిపెట్టేది పట్టణములోని ఫ్యాక్టరీల సంఖ్య, ఫ్యాక్టరీ సరుకునకు దుకాణముల సంఖ్య్హ వాటి యేజన్సీల సంఖ్య, రూపాయీలు అణాలు పైసలు లాభముల బ్యాలన్సుషీటుల సంఖ్య కాదనిన్నీ విదేశపు గ్రామ పరిశ్రమల వస్తువులు ఆ దేశపు నగర వాసులు భోగములకు సరిపడునో ఆ దేశమే నాగరికదేశాపతంస మనిన్నీ నగరములు నమ్మవలెను. ఇది ప్రస్తుతం
గరిమెళ్ళ వ్యాసాలు