పుట:Garimellavyasalu019809mbp.pdf/153

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రజలకు పని దొరికి చిక్కి, తినుబడి పదార్ధములు కొనుక్కోగలిగి సుఖవసతులు లభించడం చేత వాళ్ళు సంతోషిస్తున్నారు. వ్యవసాయదార్లకు లంచాలిచ్చి లక్షల కొలది యెకరములు సాగులు తగ్గించి చెల్లుబడి కాని దినుసుల ఉత్పత్తిని తగ్గించి ఉన్నపాటి దినుసుల వెలలు హెచ్చించి కొనుక్కునే వాళ్ళను సృస్టించడం వల్ల వారు సంతోషిస్తున్నారు. ఇళ్లు, వాకిళ్లూ కుదిరి తిండి తిప్పలు దొరికి, పైగా కొంత డబ్బు మిగిలితే దానితో దానితో పజలందరూ యంత్రకారుల దగ్గర నుంచి తయారగు సరుకును కొనుక్కుంటు న్నారు కనుక, తమ సరుకు కదులుతున్నది కనుక, ఫ్యాక్టరీలను కూడా కట్టుకోగలుగుతున్నారు. వాళ్ళకు నచ్చచెప్పి రూజువెల్టు వారిచేత పనిచేసే గంటలు తగ్గింది, కూలీలు హెచ్చించి, క్రొత్త వారిని పనులలో చేర్పించి నిర్వ్యాపరత్వమును తగ్గించగలుగుతున్నాడు. ఇది వరలో శ్రీమంతమైన అమెరికా చిక్కులు పడుతున్నదంటే సంతోషించే దేశాలన్నీ, కోలుకుంటున్న అమెరికా తమ వస్తువులను తెప్పించుకొని తమ దుస్థితిని కొంచెం తగ్గించకుండా తనలో తాను సరిపెట్టేసుకుంటున్నదే అని ఓర్వలేకుండా వుంటున్నారు. ఇదీ అమెరికాలో జరుగుతున్న ప్లానింగు, లేక ప్రణాళీక.

      ఇవన్నీ మానవుడి ప్రణాళికలు. మానవుడి ప్లానులన్నీ తాననుకున్నట్లే సాగుతూ వుంటాయి అనుకోకూడదు. ప్రకృతి జన్యులమై పరిమిత బుద్ధి యోచనలు గల మనమే యటువంటి ఉత్కృష్ట విప్లవములూ మార్పులూ తెస్తూవుంటే మనకంటే అనేక రెట్లు వెఱ్ఱివికారాలు కలిగిన ప్రకృతికి వీనిని పాడుచేయుట అనగా నెంత? లేదా సాయము చేయుట అనగా నెంత? రావణాసుర ప్రయత్నాలు చేస్తూ వున్న రష్యాలో అనావృష్టి కలిగి తెల్లరొట్టే ధర పెరిగి ఏప్రిల్ నెలలో 10 లక్షలు జనులు మరణించినట్లు తెలుస్తున్నది. పండిన్మ పంటలు చెల్లక వాటికి ధరలు కల్పించుటకై భగీరధ ప్రయత్నము మీద లంచములిచ్చి గోధుమ సాగు భూమిని లక్షల కొలది యెకరములు తగ్గించిన అమెరికాలో వేడిగాలులు వీచి పంటలు తగ్గి కాటకమ్లు కలిగే సూచనలవు పిస్తున్నవి. కాని ధైర్య స్తైర్యములుగల ప్రెసిడెంటు తగిన ప్రతిక్రియలు చేస్తానని చెప్పుతూ ప్రజలందరికీ  ధైర్వోత్సాహములు పురిగొల్పుతున్నాడు. జర్మనీ, ఇటలీ మొదలగు తక్కిన అయిరోపా దేశములన్నీ
గరిమెళ్ళ వ్యాసాలు