పుట:Garimellavyasalu019809mbp.pdf/152

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

క్యాపిటలిస్టుల సరకు విడుదల కానందువలన క్రొత్త మార్గము త్రొక్కి 'ప్రాటెక్షనిష్టు ' అయి అటావా కంచె పెట్టుకోవలసిన కర్మం దానికి పట్టింది. కాని బొండాల నాడు పొర్లి పొర్లి యేడ్చక్వడన్నట్లు అమెరికాకు కూడా యీ దరిద్రం తప్పింది కాదు. బ్యాంకు నిండా రొక్కము, కోట్ల నిండా దినుసులు, గోడౌనుల నిండా సరుకులు గల అమెరికా దేశములో ఈ మూడు మూర్తులూ ఒకరి నొకరు నమ్మి ఒకరిదగ్గర కొకరు పోగా ఎవరి గూట్లో వారు మూలుగుతూ ప్రజలందరి పొట్టలూ మాడ్చడము మొదలు పెట్టినవి. ఏమంటే ఏమి లాభము? ప్రజలు తిరిగీ తీర్చగలరన్న హామీ లేదు కనుక బ్యాంకుల వారు ఒక్క దమ్మిడీ పైకి తీయక ఎవరికీ ఇవ్వక, వడ్డీలు లేకుండా వున్నవనిన్నీ, ప్రాత బాకీలు రాకుండా వున్నవనిన్నీ యేడుస్తూ కూర్చున్నారు. డబ్బు లేక కొనుక్కునే ప్రజలు లేకపోవట చేత ప్యాక్టేరీల వారు సరుకులు పురుగులు పట్టనిస్తున్నారు గాని కావలసిన వారి కేమీ యీయరు. రావలసిన బాకీలు రాక యియ్యవలసినవి తప్పక చిన్న చిన్న బ్యాంకిలన్నీ దివాలా! ఇక వ్యవసాయపు దినుసులు, ముడి దినుసులున్నా యంత్రాలే పడుకుంటే వాటి మాట లెవరికి కావాలి? ఆహార దినుసులు కొనుక్కొనుటకు డబ్బెవరి దగ్గర నున్నది? ప్రజలు చస్తే చావనీ కాని దుడ్డియ్యకుంటే తిండేవరు పెడతారు? పండిన పంటలకే యీగతి పడితే క్రొత్తగా పండించఛానికెవరికి గుండెలున్నవి? ఇట్టి పరిస్థితిలో ప్రజలు రష్యాలో లాగ సమిష్టివాదులై తిరగబడి దోచుకొని సరీగా పంచుకోవడం తప్ప వేరే త్రోవ లేకుండెను. అయితే అమెరికా పెట్టుబడిదార్లు ప్రభుత్వము వారు బ్యాంకర్లు రష్యావారంత మూర్ఖులు కారు. హిందూదేశం నాటుకోమట్లు, ఆర్యవైశ్యులు, కళీంగకోమట్లు లాగ ఏ వొడ్దు కావొడ్దు కాచుకొని బాకీదార్లను నిలబెట్టి తామునిలబడి మళ్ళీక్రమంగా పిండుకొనే పద్దతివాళ్ళు, వీళ్ళందరినీ కూడకట్టుకొని ప్రెసిడేంటు రూజువెల్టు సర్వాధికారత్వము పొంది ప్రజలందరి చేత వొప్పిస్తూ క్రొత్త క్రొత్త యేర్పాటులు ఛేస్తూ రాజ్యూన్నంతటినీ కోలుకునేటట్లు చేస్తున్నాడు. బ్యాంకీల వాళ్ల దగ్గర తాము పూచీ పడి కోట్ల కొలది ద్రవ్యము వడ్డీకి వాడుతుండడం చేత వాళ్ళు సంతోషిస్తున్నారు. ఈ ద్రవ్యముతో కొత్త రోడ్లు పోయించి, అడవులు నరికీంచి, యిళ్లు కట్టిస్తూ వుండడం చేత

గరిమెళ్ళ వ్యాసాలు