Jump to content

పుట:Garimellavyasalu019809mbp.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అనవసరపు పరుగులు పెట్టక, అయోగ్యముగ క్రుంగిపోక, వీలయినంత లేస్తూ, సాధ్యమైనంత వరకు తమ యెగుమతులతో చుట్టూ యెగబ్రాకుతూ అల్లకల్లోలము పడుతూ వున్నది. ఆసియా ఖండము చూస్తే జపాను విజృంభణమునకు అంతూపొంతూ లెదు. జానా బెత్తెడు ద్వీపాలలో నుంచి చీమలపుట్టలు లాగా ప్రజలు పుట్టుగొస్తున్నారు. వారందరికీ భీషణ సైనిక కవాతు, కొరియా మంచూరియాల నాక్రమించుకున్నది. చీనాను మ్రింగ చూచున్నది. రష్యా పైకి పిల్ల దూకుళ్లు దూకుచున్నది. అంతర్జాతీయ సమితినే కదు, అఖిల పాశ్చాత్య సమితిని, హడలగొట్టుచున్నది. యుద్ధ నౌకలు, విమానములు పెచ్చు పెరుగుచున్నవి. దీనికి తోడు ఉపద్రవమైన పంటలు పండిస్తూ యంత్రాలతో సరుకును తయారుచేస్తూ ఎంతేసి టారీపు గోడల నయిన అవలీలగ దాటేసి కారు చౌకగా ప్రతీదేశంలోనికి దించుతూ "ఇదం బ్రహ్మ మిదం క్షాత్ర" మన్నట్లు "ఇదం యుద్ధం ఇదం వర్తక" మని ప్రళయతాండవం చేస్తున్నది. తక్కిన మనమూ, మన పెద్దన్నగారగు చీనా, తక్కిన చిన్న తమ్ములగు ఆప్ఘనిస్థానము, అరేబియా, పెర్షియా మొదలగు దేశముల మాటనా? మన కాలోచనలు తక్కువ లేవు కాని అంకుశా లెక్కువగా ఉండి అణచి పెట్టుచుండుట చేత అదృష్టవంతుల ఆటలన్నీ మనమీదే సాగి వచ్చి మన మధోగతులపాలై, ఆఘటన ఘటనా సమర్ధుడగు పరమేశ్వరుడెట్లా చేస్తే అట్లాగే కానీ అని పరిపూర్ణ వేదాంతులమై బాధలు పడుతున్నాము.

మన హిందూ దేశమునకు తల్లిపట్టే కాని పిల్ల పట్టేమి లేకున్నది. మన మొఱ్ఱలన్నీ, మొఱ్ఱలలాగే వున్నా, మనపై నవ్యాజ ప్రేమగల ప్రభుత్వము వారే మైనరు తరపున బాధ్యతలన్నీ వహించి మన కోసం ప్లానింగులు చేస్తున్నారు. తలగల మగాళ్ళంతా జైళ్లలో క్రుంగుతున్నప్పుడు మొలలేని సభ్యుల నందరినీ ముఖ్యులుగా చేసి ఒక ఆర్డినెన్సు శాసనాలా, అట్టావా ఒడంబడిక చట్టాలా, తెల్లకాగితాని కంగీకారపత్రాలా, వారి యిష్టము వచ్చిన పత్రాల మీదల్లా బుల్లి దస్కత్తులూ, పెద్ద దస్కత్తులూ పెట్టించుకున్నారు. ఇందువలన దేశమునకు స్వాతంత్ర్య బంధనమే కాక, పరిశ్రమలకు రక్షణ బంధనము కూడా తొలగినది. అగ్గిపెట్టెల పరిశ్రమ అగ్గిపాలౌతోంది. పంచదార పరిశ్రమ పంచలపాలౌతుంది. బట్టల పరిశ్రమకా ఒక ప్రక్కన జపానుకో

142

గరిమెళ్ళ వ్యాసాలు