పుట:Garimellavyasalu019809mbp.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కత్తికట్టి సమాన శత్రువులతో పోరాడి విజయద్వజములను ప్రతిస్ఠించ లెదు? ప్రతాపరుధునికన్నగౌరవ మొక్క ఓరుగల్లు ప్రాంతమువారిదేనా? శ్రీనాధుని పెంచిన కీర్తి ఒక్క నెల్లూరు మండలముదేనా? పెద్దనదులను, శ్రీకృష్ణదేవరాయలనువర్ధిల్లజేసిన తేజము ఒక్క రాయలసీమవారిదేనా? పంచమవేదమగు ఆంధ్ర మహాభారతకృతిని ప్రారంభించిన యశశ్చంద్రిక నొక్క రాజమహేంద్ర వరమే గుత్తకొన్నదా? వీరిలో నెవ్వరి పేరు దలచుకొన్నను ఆంద్రులకందరకును పులకాంకురములు పాడమకుండునా? రాయల పరిపాలనము కేవలదత్తమండలములతోముగిసినదా? దక్షిణ దేశమునందంటను అతని ధాటి వెలయ లేదా, కటకమునకును అతని పరాక్రమము ప్రసరించలేదా? ఇంటింటను ప్రతీ కవీశ్వరుని చిత్రములు సంచరించుచున్నవే? వీనిలోదేనిని ఏయాంధ్రుడు నాదికాదనగలడు.లేక నాదిమాత్రమే అనగలడు? ఈ భేదములీనాటికైనను పటాపంచలు కావలదా?

   ఆంద్రులందరును ఇట్టి స్వల్ప భేదములనుజ్ మాని యేక చైతన్య్హముతో విజృంబించగలిగిననాడే వారి ప్రజ్ఞ దేదీప్యమానము కాగలదు. ఆనాడే ప్రారంభ వయోజన విద్యలు సత్వరముగా వ్యాపించగలవు. మండల రాష్ట్రీయ పరిపాలనములు చక్కగా వర్ధిల్ల గలవు.  వ్యవసాయ వాణిజ్య పరిశ్రమలు సవ్యముగా విజృంభించగలవు. శ్రీ సౌభాగ్యములు చెలరేగగలదు: కావ్య నాటకాలంకిఆరములు కమనీయములు కాగలవు; స్వల్ప భేదములెల్లయు తొలగి సామనస్యము చెలగగలదు: అఖిల భారత జాతీయాభివృద్ధికి కూడ మన మిప్పటి కంటె చక్కని దోహదమొ సంగగల్గుదుము. ఈ లోపల మన లోపముల నెన్నిసార్లు మనము లెక్కపేట్టుకున్నను లాభములేదు అని యెల్లయు తొలగగల తరుణౌష మొక్కటియే అదియే స్వరాష్ట్ర సంసిద్ధి అందుకే మన పయత్నముల నెకముఖము చేయవలసిన అవశ్యకత.
ఫెడరేషను ఈ సమస్యకు సంబంధము లేదు
   మరియు నొక్కమాట ఫెడరేషను వస్తే కాని ఇది సిద్ధంచ నేరదనుమాట 
గరిమెళ్ళ వ్యాసాలు