పుట:Garimellavyasalu019809mbp.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మనము అనుకోకూడదు. ఫెడరేషను రాకపోయినను ఇది సిద్దింప గలదని ధ్రువమైనది. ఆ విషయమంతయు ఇక్కడ తలపెట్టుట్ చర్వితచర్యణము. మనసునుకొనేరీతి ఫెడరేషను వచుటకు చాలా కాలము పట్టవచ్చును. బ్రిటిషువారు ఇస్తామంటున్న మోస్తరు ఫెడరేషను మాకు వద్దని కాంగ్రెస్సే ఆటంకములు చెప్పుచున్నది. యుక్తమఈణా ఫేడరేషను వచ్చుటకు ఆంధ్రరాష్ట్ర నిర్మాణము అడ్డు కానేరదు. మనమునుకొనె రీతి ఫెడరేషను వచ్చునుగాక, రాకుండును గాక, మన రాష్ట్ర నిర్మాణ ప్రయత్నమునుండి మనము విరమించుటకు వీలులేదు. అంధ్రదేశ మంతయు ఏకకంఠముతో ఇందుకై మాఱుమ్రోగవలెను. మద్రాసు శాసన సభలలో ఈ తీర్మానము సత్వరముగా ప్యాసు కావలెను. సెంట్రలు సభలలో ఇది ఆమోదింపబడవలెను. బ్రిటిషు పార్లమెంటు ఇట్టి కోర్కెకు అడ్దు చెప్పజాలదు. అడ్దుచెప్పితే అప్పుడే ఆక్షేపింది పోరాడవచ్చును. కొందరూహించుచున్న ఆటంకములు ఊహలు మాత్రమే కాని సత్యము కావు. తీవ్రప్రయత్న మాత్రమున ఇది సులభ సాద్యము. ఇటువంటి తరుణముల నిదివరలో నెన్నింటినో కోలుపోతిమి. ఇదియే ఆఖరు ప్రయత్నముగా నమ్మి మనము పట్టువిడవకుండా పోరాడవలెను. ఈ సమయమును కూడ వృధా పుచ్చితిమేని ఫెడరేషను వచ్చిన తరువాతనైనను వేఱు వ్యతిరేక కారణములను అధికముగా అక్కాలమున గుత్తళముగా గ్రుచ్చి యేకరువు పెట్టుదురు. కాలము తిరిగిన కొద్దీ జూలము తప్ప మరే క్రొత్త విశేషమును రాబోదు. మన దృష్టిని ఈ సమస్యనుండి తప్పించి, మన ఆశయమును నీటి బుచ్చుటకై అనేక ప్రయత్నములు జరుగుచున్నవి. వీనిని మొదటిలోనే త్రుంచివేయ కున్న ఎడల రానురాను ఇవి మరింత ప్రబలమగును.

- భారతి, డిసెంబర్, 1937