పుట:Garimellavyasalu019809mbp.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

లాభములును నష్టములును సర్వసమానములు ఒకరి నష్టము నొకరి లాభముగాను, ఒకరి లాభము తమ నష్టముగాను బావించు కొందురని అనుకొనుటకు వీలులేదు. కొన్నికొన్ని మండల సంస్యలు ప్రత్యేకములగునుగాక, ఇప్పుడు మాత్రము కాకున్నదా? సమిష్టి ఆంధ్ర సమస్యలు వేనవేలున్నవే? వాని పోషణమునకై సంకుచిత లాభ భావములకు వారు త్యాగము చేసుకోలేరజ? గాంధీ మహాత్ముని అసహాయ యోగమునందు వారు ప్రదర్శించిన మహాత్యాగములలో ఇది యెన్నవవంతు? ఇంతకును, ఒక్ అవయవము కొరకై శరీరమునందలి ఇంకొకయవయవము పడే శ్రమ త్యాగ మనిపించుకొనదు. ప్రధానకర్తవ్యమే, అట్లే "రాయలసీమ" కొరకు సర్కారులో . "సర్కారుల" కొరకు రాయలసీమయో యేదేనా శ్రమపడవలసి వస్తే అది త్యాగమనిపించుకొనదు. సకలాంద్రుల శ్రేయస్సే ప్రతి ఆంధ్రుని శ్రేయస్సున్ను ఏయొక్కవ్యక్తి ఆశ్రేయస్సును కూడ ఆంధ్ర రాష్ట్రము తనదంతటిదిగానే భావించి దానిని మాయము చేయుటకై ఆందోళన ప్రారంభించినాము! ఈ ప్రత్యేకాంధ్ర రాష్ట్ర ఆందోళనను వ్యతిరేకించి సమిష్టి రాష్ట్రె సంతృప్తితో కాలక్షేపము చేయుచున్నయెడల, ప్రెత్యేక భాగములకు కలిగే విశేషపుష్టి యేమియును లేకుండను సరేకదా, సమాన నష్టములు కూడ అపరిమితముగ నున్నవి. కనుక వ్యతిరేక భావముల కింతతో స్వస్తి చెప్పవలెను.

 ఇంతకును ఆంధ్ర మండలములను, రెండు ఖండములుగా విభజించుట యెట్లు? దత్తమండలము లొక ఖండమును, సర్కారు లొక ఖండమును, తక్కిన భాగములొక ఖండమునా? వీనిలోగల ప్రబల భేదము లేవి? వీరందరిదీఒక భాష కాదజ, కులములు నాడులు మొదలగువానిలో భేదములు కలవా? ఆచారవ్యవహారములలో  భేదములు కలవా? వీనిమధ్య కొండలు సముద్రములు నిలచి అంతరాయములు కలిగించుచున్నవా, రాకపోకలకు  సులభోపాయములు తక్కువా? దేనిని బట్టి  ఖండ ప్రభేధము? చారిత్రకముగా నైనను ఇవి వేరువేరు భాగములా? ఎన్ని ఆంధ్ర ఆంధ్రేతర సామ్రాజ్యముల క్రింద ఇవన్నియు కలసి యుండలేదు. ఎంతమంది ఆంధ్ర కవి, పండిత సచివోత్తములు వీనితో సమాన గౌరవముతో సంచరించుచు ఆంధ్ర విజ్ఞానమును, కళలను పోషించుచుండలేదు? ఎన్ని సందర్భములలో వీరందును 
గరిమెళ్ళ వ్యాసాలు