పుట:Garimellavyasalu019809mbp.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కట్టుకొనియున్నారు. సందేహములు స్పర్థలు పటాపంచలగుచున్నవి. ఇది కేవలము ప్రాంతీయ సమస్యగా కాక అఖిల భారతసమస్యగా కూడ పరిణమించినది. అఖీల బారత కాంగ్రెసు కమిటీ నుండియే మద్రాసు ప్రభుత్వమునకు హుకుము రానున్నది. విజయము చేరువవుదున్నది. కనుక నాయకులును ప్రచారకులును కూడ చిలిపి సందేహములను మాని కార్యక్రమమునాకై గడంగుట శ్రేయము.

   "ఆంధ్రులలో ఐకమత్యము లెదు. ఒక ప్రాంతము వారు రాష్ట్రము కావాలంటే ఇంకొక ప్రాంతమువరు వద్దంటున్నాదు. ఒక పార్టీకి ఇంకొక పార్టేకి పొసగకుండా ఉన్నది. ఇవన్నీ సర్ధుకుంటే కాని ఆంధ్ర రాష్ట్ర సమస్య నాలోచించుటకు వీలులేదని కొందరాంధ్రేతరులు ఇప్పుదిప్పుడుకూడవాక్రుచ్చుచున్నారు. ప్రత్యేక రాష్ట్రమేర్పడేవరకును ఇట్టి భేదములను రేపుటకును వర్ధిల్లుటకును అవకాశము లుంటునే ఉండును. వీనికన్నిటికిని స్వస్తి చెప్పవలెనను సంకల్పముంటే ఆంధ్ర రాష్ట్రమును వెంటనే విభజింపక తప్పదు. ఆమరునాటి నుండియు ఇట్టికాల్పనిక భేదములన్నియు నశించి ఐకమత్య ధర్మము తనంతట తానే వర్ధిల్లగలదు.
  ప్రత్యేక రాష్ట్రమైతే రాయలసీమ వారికో, ఉత్తరసీమలవరికో కొన్ని ఇబ్బందులుండునని కొందరు వారింతురు. విశాలదృష్టితో చూచినయెడల నవి యెవ్వియును ఇబ్బందులుకావు. ఒక వేళ అయినను , ఈ జిల్లాలనన్నిటిని ఒక కాంఫోజిట్టు రాష్ట్రములో కుక్కుటవలన కలిగే ఇబ్బందుల కంటే యెక్కువ కావు. ప్రస్తుతము అవి యిబ్బందూలవలె కొందర కగబడినను ప్రత్యేక  రష్ట్రే మేర్పడగానే వానినన్నిటిని సవరించుకొని సమ్యగ్భావముతో వర్రించగలనేర్పు సిద్ధించక మానదు. ఒక కాంపోజిటు రాష్ట్రములోనే ఎన్నోయిబ్బందులు పొందుచు కాలక్షేపము చేయువారు ప్రత్యేక రాష్ట్రమ్లోకలతలుపడుతారన్నది వ్యర్ధమగుమాట.
భేదములు నిజమైనవి కావు
 ఇంతకును ఆంధ్రులేయే ప్రాంతముల నెట్టియెట్టి ఆచార వ్యవహరాదులతో నున్నను ఆంధ్రులే, వారిది యేకభాష, యేకభావములు వారి
గరిమెళ్ళ వ్యాసాలు