పుట:Garimellavyasalu019809mbp.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆంధ్రరాష్ట్రమునకు ఆలస్యమేల?

(ఆలస్యమువలన కలుగు మహానర్ధములు సత్వర కార్యనిర్వాహణవశ్యకత)

    ఆంధ్రు లారంభశూరులన్నమాట ఆదునిక్ కాలములో అనుశ్రుతమైపోయినది. దేశోద్ధారకుని పత్రికా సంస్ధలు పట్టాభిగాని బందరుసంస్ధలు ఉన్నవ వారి శరదానికేతనము మొదలగు కొన్ని మాత్రము ఈ సూత్రమునకు కాస్తవ్యతిరేకములై నేటివరకును నిలిచి యున్నవి. తగిన కట్టుదిట్టములు చెస్తే చిరస్థాయులే కాగలవు ఇంక రాజమహెందవరం పేపరుమిల్లుకు పాపరుచీటీ వచ్చినది. చెన్నపురి స్వరాజ్య పత్రికకు కన్నం పడిపోయినది. ఎన్నెన్నో పారిశ్రామిక సంస్థలను యెన్నెమ్మ కొట్టి వేసినది. క్రొత్త క్తొత్తగా ఊహింపబడుచున్న సినీమాకంపెనీలు రిత్త ప్రకటనలగుచునవి. దేశీయ విద్యాప్రయత్నములు తేజోహీనము లగుచున్నవి కొన్ని కొన్ని ఖధ్దరుసంస్థలు కూడ కల్తీలపాలగుచున్నవి.
 ఇందుకు కారణము లేకపోలేదు. ఏ సంకల్పము నైనను ప్రారంభించేవాడుండే విజృంభనం ఆ మర్నాడు ఆంధ్రుల కుండదు. ఆరంభములు అత్యంతమగు అట్టహాసముతో జరుగును. ఆ సంస్దలకు ఆరంభకులుగా ఉపన్యాసకులుగా, అధ్యక్షులుగా, కార్యదర్శులుగా, కోశాధ్యక్షులుగా, భావస్వాములుగా చేరేవరి సంఖ్యకు మితియుండదు. ఎవరిని చేర్చుకొనకున్న యేమి ముప్పువచ్చునో అన్నంత ఉప్పనగాప్రతీదీ మొట్టమొదట ఉండదు. ఇట్టి శుభోదయముతో ప్రారంభమైన సంస్థకు అడ్దు యేదిఅనను రాగలదా అన్నంత ఉత్సాహము మొదటి కొన్నాళ్ళదాకా ఆంధ్రుల నందరినీ ఉఱ్ఱూతలొగించుచుందును. ప్రోస్పక్టసు అచ్చుపడగానేనో, పేరులు ప్రకటింపబడగానేనో ఆ ఉద్రేకము కొంచెము తగ్గునుజ్. కార్యోపక్రమణ మనేటప్పటికి కలతలు ప్రవేశించును. అక్కడనుంచి కార్యదర్శుల పాట్లు చెప్పనక్కరలేదు. సభ అనేనాటికి కోరముకూడుటయే కష్టము. కూడితే ఒక నిర్ణయమునకు రావడం కష్టము. దీనితో ఒకరిద్దరు వెనుకతగ్గి బిగి తగ్గించివేతురు. ఇతరులు వీరి ననుసరించి విరమింప బ్రయత్నము చయుచుందురు. అటు తరువాత
గరిమెళ్ళ వ్యాసాలు