పుట:Garimellavyasalu019809mbp.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వైండింగు అప్పుడు కడు సులభమున నెరవేరిపోవును. కొందరికి కొంత నష్టముతో వివేక ముదయించి, వచ్చే ప్రయత్నాలలో అడుగుపెట్టుట మానుకొందురు.

  ఇతర రాష్ట్రములు, అనగా బెంగాల్, గుజరాతు, పంజాబు, బొంబాయిలలో అనేక జాయింటు స్టాకు కంపనీలు మిల్లులు, బీమా కంపెనీలు, ఫిల్ము చిత్రములు, బ్యాంకులు మొదలయినవి లేచి దీనదిన ప్రవర్ధమానము లగుచుండగా మన ఆంధ్ర రాష్ట్రములో అవి చాలా అరుదుగా ఉన్నవి. ప్రతీరష్ట్రపు విదేశపు కంపెనీవారున్నూ మన ఆంధ్ర రాష్ట్రమును పలు విధముల దోచుకొనుచుండగా, మన శ్రమను ద్రవ్యమును మనము వారికి ధారపోయుచున్నాం. ఇతర రష్ట్రములలోని యెట్టి డిగ్రీలును లేని యువకులు నలకు వందలు వేలు జీతములు లాగుచుండగా మనము పెద్ద చదువులకై ఆస్తులు తగులబెట్టుకొని నిరుద్యోగులమై మలమల మాడిపోవుచున్నాము. మనకు మూలధనమునకు కొదవా, ధీచతుర్యమునకు కొరతా, కార్యనిర్వహణశక్తి తక్కువా, యోగ్య వర్తనకు లోపమా? కార్యంపట్ల ఐకమత్యము శూన్యముగ ఉండుటొక్కటే దీనికి కారనమనవలెను. ఈ కారణము వల్లనే ఏకైక వ్యక్తి మాత్రస్థాపితములగు సంస్ధ లెవియో కాస్త బాగున్నవి. తక్కినవి కృశించినవి.
సంఘీభావము అవశ్యకము
   ఇది కలియుగ్ము, ధనయుగము, వణిజ్య యుగము, పదిమంది కలిస్తేనే కాని ప్రసిద్ధమైన ప్రయత్నము లేమీ కొనసాగవు. పదిమంది మాట ఒక్కటైతేనే యే సంస్థ అయినా బాగా వర్ధిల్లుతుంది కాని, లేకుంటే అత్యంతోన్నత స్థానమునకు రాజాలదు. ఈ యుగములో అత్యంతోన్నతమైన సంస్థలు మాత్రమే ఢకామక్కీలకు ఆగి కొంత కాలమునకు నిలుచును కాని, సాధారణ సంస్థలు చితికపోక తప్పడు. పదిమందితో కలిసి పనిచేసే శక్తి ఆంఢ్రులకు తక్కువనుకోవాలి. ఎవరి క్రిందనో చాకిరీయైనా చేస్తారు కాని తమ సంఘాంతొ సమరసంగా వర్తించలేరు. ఎవరి పట్టు నెగ్గాలని వారికే ఉబలాటం. పదిమంది పదితోవల్ లాగుతే అసలు పనే చెడిపోతుందనేనా వారికి దృష్టి వుండదు. ఎవరికీ ముఠీత్రోపు యెక్కువగాద్ ఉంటే వారు కొంతవరకే పైచెయ్యి కలిగి ఉండగలరు గాని, కలకాలం ఆ స్థితిలో వారు
గరిమెళ్ళ వ్యాసాలు