అందరినీ తనకు బానిసలుగా మార్చుకొన్నది.
ఆ ధనానికంతటికీ పాశ్చాత్య దేశాలు అధిపతులైనవి. కనుక నేడు లోకమంతా వారికి ఊడిగము చేస్తున్నది. ఆ ధనము మీద ఉమ్మి, శ్రమను అరాధన చేసి సోవియట్టు రష్యా నేడు వాటికంటే పటిష్టమై దేదీప్యమానమై రాణిస్తున్నది. ఆమోస్తరు కమ్యూనిజమునే లోకములో నంతటా పెడదామని రష్యా ప్రయత్నించుచు కమింట్నర్నులను ఆర్గనైజు చేస్తున్నది.
కాని ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క మోస్తరు కమ్యూనిజము అనువై వుంటుంది. మన జాతీయ సంప్రదాయమైన కమ్యూనిజము మన దేశములో అనాది సిద్ధముగా వచ్చుచున్నది. దానికి ప్రతిబంధకము ఈ పాశ్చాత్యధనపిపాస ప్రభుత్వాల మూలముగానే కలిగినది. దానిని తొలగించగల వీరనాయకుడు మనకు కావలెను.
భారతదేశమిట్టి ఉత్తమ తరగతిని కమ్యూనిజమునకు నెలకొల్పి, ధనమును కొన ఊపిరితో మాత్రము అత్యావశ్యకమైన మేరకే ఇచ్చట నిలువ నిచ్చి, ఉత్తమ వ్యవస్థలు లేవకుండుట కది కారణం కాకుండునట్లు చూడవలెను.
"మాతాపుత్ర విరోధాయ హిరణ్యాయనమోనమః" అన్నట్లు ధన మొక్కటి లేకపోగానే యెన్ని జాతులు యెన్ని మతములు ఎన్ని ఆచార వ్యవహార భేదములున్నా విరోధాలు మరి ఉండవు. ఒక తోటలో యెన్ని రకముల పూల మొక్కలుండవు? గులాబీ మొక్కలు సంపెంగి మొక్కలు పోరాడుకొనుచున్నవా? మల్లిపూవులు జాజి పూవులు సరసాలాడుకోలేదా? అట్లే సమస్త జాతులును సామరస్యముతో వర్ధిల్లగలవు.
ఢంకా, 1948 జూన్.
116
గరిమెళ్ళ వ్యాసాలు