Jump to content

పుట:Garimellavyasalu019809mbp.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మన ప్రభువులు మన నాయకులు ఇంత అపసవ్యంగా ఉంటున్నా మనకీ మాత్రమైనా నేడు వస్త్రములు పుట్టడం, ఈ మాత్రం మంది మైనా బ్రతకడం, కాశ్మీరంలో ఈ మాత్రం పదవియైనా కరువు దక్కడం జరుగుచున్నదంటే, మన హిందువులు చేసుకున్న యేదో పూర్వ జన్మ పుణ్యఫలము, ఋషుల ఆశీర్వచన ఫలము కాని మన నాయకుల ప్రయొజకత్వం కాదని లోకమెల్లయు ఘోషిల్లుచున్నది.

ధనాశా నిమగ్నమైన ఈ నాయకత్వమును మూడు తన్నులు తన్ని ఇప్పటి బ్యాంకులలోని కృత్రిమ క్యాషుబుక్కుల నన్నిటినీ సముద్రములోకి విసరి, కష్టపడకుండా లెక్కలు వ్రాసుకొనే వారిని కారడవుల పాలు చేస్తేనె గాని, నిజంగాకష్టపడేవాళ్ళు పుట్టరు. అప్పుడు డబ్బు కోసం కాక కష్టపడడం పనిచేయడం తమ ధర్మమనుకొని ప్రజలు కష్టపడతారు. అప్పుడే యెవరి కష్టమునకు తగిన ఫలము యెక్కువో తక్కువో వానికి దక్కింది దోచుకోగోరే వారి నోట్లో కరక్కాయ పడుతుంది.

ఇది గాంధీమహాత్ముని సత్యాహింస శాంతి యథేచ్ఛా సిద్దాంత పద్దతుల వల్ల యుగ యుగాల నాటికైనా సాధ్యము కాదు. ఏవడో ఒక మహావీరుడు లేచి ఒక్క కలము పోటుతో దీనినంతటిని యెత్తవేసి సర్వసమానత్వమును నిలబెడితే, సంతోషించేవాళ్ళు కోట్లు అవుతారు. యేడిచేవాళ్ళు యేడుగురే మిగులుతారు. ధన ఉద్యోగాలు అనే యెర లేకుండా చదువుకొనేవాళ్ళు చదువుకొని దేశమునకు ప్రయోజనకారులవుతారు. అట్టి యెర లెకుండా కర్షక కార్మికులు తృప్తి తీరా కష్టపడి వస్తూత్పత్తి సాధకులవుతారు. అట్టి యెర కోసం కాకుండా ఉద్యోగం ధర్మం కోసం సమర్థులు పదవులలోకి వస్తారు. చక్కగా కార్యాలు నిర్వహిస్తారు. అట్టి యెర లేకుండా కళాభిరుచి గల వారు కావ్యాలు వ్రాసి చిత్రాలు చెక్కి భవనాలు యంత్రాలు నిర్మించి దేశములను దేదీప్యమానంగా చేస్తారు.

అప్పుడు చదువు, కృషి, ఉద్యోగం సమస్తం కూడా కళకే అవును. ఇట్టి కళలన్నీ, శిల్పులకు కూలి యివ్వడానికి లోకంలో డబ్బులేనప్పుడే బాగా వర్ధిల్లినని. డబ్బు ప్రవేశించి కిట్టుబాటు లేని చదువులకు వృత్తులకు ఉద్యోగములకు లాంఛనములకు కళలకు పూజా పునస్కారములకు యోగ విద్యలకు స్వస్తి చెప్పి

గరిమెళ్ళ వ్యాసాలు

115