పుట:Garimellavyasalu019809mbp.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సాధ్యము కావు.

  ఇప్పుడు ప్రజలు దేశాన్ని పాలిస్తున్నారన్నమాట కపటము ప్రజలను గిలుబాడి వొటులను తస్కరించి లాభాలు దేవుకొనే వేషాల రాయళ్ళు దేశాన్ని యేలుతున్నారు. వారిలో మచ్చుకైనా ఒక్క నిష్కిఅల్మషమూర్తి కానరాడు. అట్టివాడు అధవా నోరుమూసుకొని ఊరుకోవలసినదే.
   మననాయకుల వీరేత్వమును మరచిపోయారు. దనవంతుల ప్రాపకానికై దేవురిస్తున్నారు. వారిని పదవులలో నుంచి తొలగించగల వీరుడొక్కడు కళ్ళపడితే చాలు ఆ బాలగొపాలము అతనికి చేతులెత్తిమ్రొక్కి  ధన్యనాఢ్యుల కపటనాటకముల నెల్ల ఒక్క నిముషములో దరుమాడునట్లు చేయగలరు.
  అట్టి నాయకుడే ఈ కృత్రిమ ధనము యొక్క పరువు ప్రతిష్ఠల నూడపీక గల సమర్ధుడు. పజలలో వీరత్వమును, దేశాభిమానమును, శ్రమాశీలమును కళాభిరుచిని పుట్టించగల దక్షుడు.
  గాంధీ యుగమునకు ముందు అట్టి నాయకులెందరో ఉండబట్టే మన దేశస్థుల కట్టి త్యాగము వీరసాహసము కార్యదీక్షఉదయించి నది. గాంధీయ్లుగము క్రొత్తరకం కూడా అని కొంత విలసిల్లినవి. కాని గాంధి అధికారము హెచ్చుచున్న కొద్దీ, కాంగ్రెస్సు కపట వేషధారుల కాటపట్టయి శుష్కపటాటోపములో తప్ప జాతీయాభిమానము లెక్కడా కలికంలోనికానరాకుండా చేసి అత్యంత ధనాధ్యుడు మొదలు కటిక దరిద్రుని వరకు, మహానాయకుడు మొదలు కర్షక కార్మికుని వరకు అందరిని ధనదాసులను చేసి, దేశం మాట మరువ్చజేసి, నిర్వీర్యం నొంరించి శుష్కాందోళనలకు గాక మరెందుకూ పనికిరాని వారినిగా చేసినది.
  గాంధీకి పూర్వముండిన విప్లవ నాయకులు మనలను గాఢ నిద్రనుంచి చైతన్యములోకి మేలుకొలిపిరి. గాంధీజీ ఆ చైతన్యమును విస్తరింప చేసి కూడా దానిని పెడత్రోవలు పట్టకుండా చేయలెకపోయినాడు. దాని ఫలితముతో మన నేటి కులతత్వ, భాషాతత్వ,రాష్ట్రే తత్వాది ద్వేషములను కొట్లాటలు, దాని ఫలితమే భారతదేశ విభజన, ధరాడ్యుల ప్రతిభ, ధరల హెచ్చుదల, పదుల దురాశా పాతకత్వం, అల్పుల పదవీ వ్యామోహం, పదవులలోనున్న వారి స్వార్ధపరతత్వం, స్తబ్దుత్వం, ఉత్తములను అద: పాతాళములోనికి అణచడం మొదలైన దుర్గుణాలన్నీ
గరిమెళ్ళ వ్యాసాలు