ఈ పుటను అచ్చుదిద్దలేదు
భారతదేశమునకు కావలసిన సోషలిస్టు విధానము
ఆశేతు శీతాచల పర్యంతం ఇప్పుడు సోషలిజం అనే శబ్దముతో మారు మ్రోగుచున్నది. ప్రతివార్తాపత్రిక యొక్క "పాలసీ" అదే అయి వుంటున్నది., మిల్లు యజమానియగు డాల్మియా మొదట సాధారణ కార్మికుని వరకు, వార్తాపత్రికా సంపుటి చక్రవర్తి యగు గోయెంకా మొదలు సాధారణ కాంపోజిటరు వరకు, జమీందారులు నాయకుడగు సుబ్బరాయన్ మొదలి రైతు కూలీ వరకు, జవహార్లాలు మొదలు పటేలు వరకు జయప్రకాశ మొదలు కృపలానీ వరకు యెల్లరును ఆ శబ్దమును గైకొనియే తమ ప్రమాణములను చేయుచున్నారు. ఇంకే సిద్దాంతముపై వైననుష్యతిరేక భావమున్న దేమో కాని నేడా సబ్దముపై నెవ్వరికిని విరోధములేదు. యూనియన్ కేంద్రప్రభుత్వ మీ సిద్దాంతమును స్థియిర్యముతో అవలంబించినచో అది విజయవంతము కాగలదేమో అన్న ఆశ యెల్లరకును జనించుచున్నది.
ప్రస్తుతం మట్టుకు పెద్దలందరూ ఏ సోషలిజములో నైనా తమ ఆస్తులకు దర్జాలకు యేమీ భంగమురాదని భావించుచున్నారు. చిన్నలందరూ తమ స్థితి మునుపటి కంటే వేయిరెట్లు బాగుగా నుండుననిన్నీ తమ స్వల్పఆస్తులకెట్టి భంగము కలుగదనియు భావించుచున్నారు. కాని సోషలిజము కావలసియున్న వనియుచు, అందుకై వలసిన యెట్టి త్యాగములకైనను వారు చేయవలసియున్నదనియు, సర్వజన శ్రేయస్సే, దేశాభ్యుదయ పురోగమన మొక్కటే తమ అందరి యేకైకాశయమై అలరార వలెననియు వరు గ్రహించగలరని నమ్మవచ్చును.
సోషలిజము యొక్క ప్రప్రదమా శయము సర్వులకు సమానముగా అత్యావశ్యక భోగములెల్లయు సమకూడుటొక్కటే కాక అని తీరగా వారెంతోకొంత ధనమును తీరికను మిగుల్చుకొను టకును యేదో యొక విధముగా దేశాభ్యుదయ కార్యముల కొరకగు ఖర్చులకై ప్రభుత్వము ఆకర్షించగలయట్లు ఉండవలనని యే. ఏ
గరిమెళ్ళ వ్యాసాలు