సంవత్సరపు టాదాయమును లేక లాభమును లేక మిగులును యెల్లరును యెప్పటికప్పుడు ఖర్చుపెట్టేసుకుంటే, దేశాభ్యుదయ సంస్థలకు కళావర్థనమునకు, పాండిత్య ప్రకర్షలకు, దేశరక్షణకు ఆస్కారముండదు.
మానవజన్మ తిని కూర్చోడానికీ భోగించి చచ్చిపోవడానికి కాక కొన్ని ఉత్తమాశయాల సంసిద్ధికోసమను మాట నెవ్వరూ మరువకూడదు. సాధారణ ఆహార నిద్రాభయ భోగాదులను జంతువులు కూడా అనుభవించి నీల్గుచున్నవి. వానికంటె మానవునిలో ఉన్న విశేషము జ్ఞానము. అజ్ఞానవాహినిని విజృంభించుటవకాశములు కల్పించకున్నచో మానవజీవితమే వ్యర్థము. క్యాపిటలిష్టు ఆధ్వర్యం క్రింద జనితమైన జ్ఞానం లోక కళ్యాణం కొరకు కంటే, మానవ విధ్వంసం క్రింద ఎక్కువ ప్రయోజనపడ్డది. సోషలిస్టు ఆధ్వర్యం క్రింద, అజ్ఞానమును భవిష్యత్పరిశోధనా ఫలితజ్ఞానమును విశ్వప్రపంచ మానవకళ్యాణము కొరకు వినియోగించవలసి యున్నది.
నిజమైన సోషలిజములో ఆస్తులకై తగవులాట లుండరాదు. సమస్తమైన ఆస్తి సర్వులదిన్ని సర్వులకు ప్రతినిధి ప్రభుత్వ సంస్థ - సర్వుల శ్రేయస్సు కొరకు ఆ ప్రభుత్వమే యాస్తినైనను అవసరమైతే తాత్కాలిక హక్కుదారునకు తగు పరిహారమిచ్చి స్వాధీనము చేసుకొని వినియోగించవచ్చును. ఇందుకు జమిందారు మొదలు రైతు వరకు సంతోషముగా అంగీకరించి, తత్పురోభివృద్ధి కొరకును, తమ పురోభివృద్ధికొరకును శాయశక్తులా శ్రమ పడుట నేర్చుకోవలెను. ఆస్తినిమిత్తమాత్రమనియు, సర్వమునకును హక్కుదారు అందరికిని ప్రతినిధియగు ప్రభుత్వమే కనుక యెక్కువ తక్కువలని కీచులాడుట ఒక మోస్తరు నేరమనియు యెల్లరును భావించవలెను.
కమ్యూనిజములో కూడా ఆస్తి సర్వమూ ప్రభుత్వముదే. ప్రభుత్వ మొక్కటే సర్వమునకు యజమానియై తన తాబేదారులకు ఉద్యోగులద్వారా సర్వుల చేత పని చేయించి అందరికీ ఇంచుమించుగా సమాన సౌకర్యములు కలిగించి అందరి ప్రేమను జూరగొన చూచుచుండును. ఇది ఒక మోస్తరు ఉత్తమరకం క్యాపిటలిజమ్ పద్ధతి వంటిది. ప్రజలకు ప్రభుత్వాజ్ఞా నిర్వహణము తప్ప మరెట్టి బాద్యతయు ఉండదు. తమ సంతృప్తిలో వారు
గరిమెళ్ళ వ్యాసాలు
103